హీరోయిన్ చాందిని చౌదరికి వాట్సాప్ లో వేధింపులు.. ఫొటోస్ వైరల్?

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతోమంది సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.అలాంటి వారిలో నటి చాందిని చౌదరి కూడా ఒకరు.

 Chandini Chowdary Gets Harassment In Her Whatsapp Details, Chandini Chowdary, To-TeluguStop.com

చాందిని చౌదరి పేరు వినగానే మొదట కలర్ ఫోటో సినిమా గుర్తుకు వస్తుంది.ఈ సినిమా కంటే అంతకుముందు ఆమె పలు షార్ట్ ఫిలిమ్స్ లో వెబ్ సిరీస్ లో నటించినప్పటికీ రాని గుర్తింపు కలర్ ఫోటో సినిమా ద్వారా దక్కింది అని చెప్పవచ్చు.

మొదటి సినిమాతోనే తెలుగు పేక్షకులకు దగ్గర ఇవ్వడమే కాకుండా నటన పరంగా ప్రశంసలు సైతం అందుకుంది.ఇది ఇలా ఉంటే నటి చాందినీ చౌదరి ఇతను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వేధిస్తున్నారని చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

అందుకు సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది చాందిని చౌదరి.అయితే గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ నెంబర్స్ ఉపయోగించి కొంతమంది వ్యక్తులు స్కాంకి పాల్పడుతున్నారని, అంతేకాకుండా వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడం కోసం మా పేర్లు వాడుకుంటూ వాట్సాప్ లో మెసేజ్లు కూడా పంపిస్తున్నారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

అంతే కాకుండా వేధింపులకు కూడా పాల్పడుతున్నారని తనతో పాటుగా తన కో స్టార్స్ పేర్లు, ఫోటోలను కూడా ఈ విధంగానే ఉపయోగిస్తున్నారు అని ఆమె చెప్పుకొచ్చింది.

Telugu Actresschandini, Color, Tollywood, Whats App-Movie

ఒకవేళ మీకు ఎవరికైనా ఇటువంటి మెసేజ్ వస్తే దయచేసి రిపోర్ట్ చేయండి మీ వివరాలను వారితో షేర్ చేసుకోకండి అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్క్రీన్ షాట్లను పంచుకుంది చాందిని చౌదరి.ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.కాగా చాందిని చౌదరి సినిమాల విషయం కొస్తే ఈమె ఇటీవల సమ్మతమే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఈ ముద్దుగుమ్మ పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీబిజీగా ఉంది.కాగా చాందిని చౌదరికి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫాన్స్ ఫాలోయింగ్ ముందు మనందరికీ తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube