నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది.ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీకి రాజీనామా చేశారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే రేఖా నాయక్ తెలిపారు.కానీ అధిష్టానం కక్ష పూరితంగా నిధులు ఆపేసిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానన్న ఎమ్మెల్యే రేఖా నాయక్ ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు.అదేవిధంగా రానున్న ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని తెలిపారు.
బీఆర్ఎస్ ఈసారి అభ్యర్థిగా ప్రకటించిన జాన్సన్ నాయక్ అసలు స్థానికుడే కాదన్న ఎమ్మెల్యే ఏ ప్రాతిపదికన జాన్సన్ కు టికెట్ కేటాయించారని ప్రశ్నించారు.స్నేహితుని కోసం ఎస్టీ మహిళ గొంతు కోశారని విమర్శించారు.







