ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొగ్గూడెంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
తను అడిగితే కనీసం భద్రత కల్పించలేదన్నారు.భద్రత తగ్గించినా తాను బాధపడలేదని చెప్పారు.
తనను అభిమానించే వారు లక్షలాది మంది ఉన్నారన్న ఆయన తనకు సెక్యూరిటీ అవసరం లేదని తెలిపారు.తాను ఉగ్రవాదిని కాదని.
భూ కబ్జాలు చేయలేదని పేర్కొన్నారు.ఆవేదన చెబితే ఎందుకు ఉలిక్కపడుతున్నారని ప్రశ్నించారు.
అధికార మదంతో రెచ్చిపోయినా ప్రజా తీర్పు ఎంతో దూరంలో లేదని వెల్లడించారు.పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా గౌరవం ఇవ్వాలని స్పష్టం చేశారు.







