ఆస్ట్రేలియాలోని ఖలిస్తన్ శక్తులు అరాచకానికి పాల్పడుతున్నాయి.భారత్ పట్ల తమ విద్వేషాన్ని వెలగకుతున్నాయి.
మేల్ బోర్న్ లోని ప్రఖ్యాత స్వామి నారాయణ హిందూ దేవాలయం పై దాడికి దిగి గోడల పై పరుష పదజాలకు రాతలు చర్యలతో మలినపరుచుతున్నాయి.ఈ ఘటన ను ది ఆస్ట్రేలియా టుడే పత్రిక గురువారం ఒక వార్త కథనంలో వెల్లడించింది.
మెల్బోర్న్ ఉత్తర శివార్లలో మిల్క్ పార్క్ వద్ద నెలకొని ఉన్న ఈ దేవాలయం స్థానిక హిందువులకు ఆరాధ్య మందిరం గా ఉంది.ఖలికిస్థాన్ మద్దతుదారులుగా అనుమానిస్తున్న దుండగులు ఈ మందిరం వద్ద ఇష్టారాజ్యానికి పాల్పడుతున్నారు.గోడలపై హిందుస్థాన్ ముర్దాబాద్ అని రాస్తున్నారు.ఇక్కడ కొద్ది సేపు గుడి గోడల పై ఈ బృందం విద్వేష ప్రసంగాలకు కూడా పాల్పడుతున్నారు.

కొంత మంది ఆకతాయిలు భారతదేశాన్ని హిందువులను దూషిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.ఈ ఘటన పట్ల స్వామి నారాయణ్ ఆలయ సంబంధిత బి ఏ పీ ఎస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఈ విధమైన విద్వేషపూరిత చర్యలను పాల్పడుతున్నారు.ఈ ఘటన అనుచితం అని తమ వెనువెంటనే శాంతి సామరస్యం కోసం ప్రార్థనలో నిర్వహిస్తామని ఆ తర్వాత సమగ్ర స్థాయిలో ప్రకటన వెలువరిస్తామని వెల్లడించారు.

జరిగిన ఘటన బాధాకరమని నార్త్నర్ మెట్రోపాలిటన్ ప్రాంతపు లిబరల్ ఎంపీ స్పందించారు.విక్టోరియా కు చెందిన శాంతి కామకులైన హిందూ సామాజిక వర్గం పట్ల ఇప్పటి ఈ పవిత్ర కాలంలో ఇటు వంటి అవమానకర చర్య జరగడం దారుణం అని ఈ ఎంపీ తమ ప్రకటన వెలువరించినట్లు ఈ ఆస్ట్రేలియా టుడే దిన పత్రిక వెల్లడించింది.







