హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహా గణపతి దర్శనాన్ని రేపు సాయంత్రం నుంచి నిలిపివేస్తున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.ఈ క్రమంలో ఇవాళ బడా గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు.
ఈనెల 28న ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం నిర్వహించనున్నారు.ఈ క్రమంలో ఏర్పాట్లను ముమ్మరం చేసింది ఉత్సవ కమిటీ.
ఇందులో భాగంగా భారీ టస్కర్ ఖైరతాబాద్ ప్రాంగణానికి చేరుకుంది.కాగా ఖైరతాబాద్ గణేశుడు మహా విద్యాగణపతిగా ఈ ఏడాది దర్శనమిస్తుండగా మొత్తం 63 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.







