గత సంవత్సరం కన్నడంలో తెరకెక్కి దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని దక్కించుకున్న చిత్రం ‘కేజీఎఫ్’.ఈ చిత్రం కన్నడ సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని వసూళ్లను నమోదు చేసింది.
కన్నడ సినిమా చరిత్రలో 50 కోట్ల వసూళ్లు అంటే చాలా గొప్ప.అలాంటిది ఏకంగా 200 కోట్ల వరకు రాబట్టింది.
బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.మొత్తం ఇండియా వ్యాప్తంగా కేజీఎఫ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
కేజీఎఫ్‌తో యష్ ఇండియాస్ కొత్త స్టార్ హీరోగా అవతరించాడు.ప్రస్తుతం కేజీఎఫ్ 2 కు సంబంధించిన చిత్రీకరణ జరుపుతున్నారు.

కేజీఎఫ్ 2లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌తో పాటు పలువురు స్టార్స్ ఉన్న కారణంగా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.ఖచ్చితంగా మొదటి పార్ట్‌కు మించి రెండవ పార్ట్ ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు.వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేద్దామని భావిస్తున్నారు.ఇలాంటి సమయంలో సినిమా షూటింగ్‌కు కోర్టు బ్రేక్ వేసింది.కేజీఎఫ్ 2 చిత్రం షూటింగ్ నిలిపేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.దాంతో ఉన్నపలంగా చిత్రం షూటింగ్‌ను క్యాన్సిల్ చేయడం జరిగింది.

అసలు విషయం ఏంటంటే కేజీఎఫ్ 2 చిత్రం షూటింగ్‌ను గత కొన్ని రోజులుగా సైనైడ్ హిల్స్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు.అక్కడ షూటింగ్ చేయడం వల్ల పర్యావరణంకు హాని కలుగుతుందని స్థానికుడు ఒక వ్యక్తి కోర్టులో ఫిల్ దాఖలు చేశాడు.అతడి పిల్‌కు స్పందించిన కోర్టు అతడి వాదనలతో ఏకీభవించి కేజీఎఫ్ 2 చిత్రం సూటింగ్‌ను సైనైడ్ హిల్స్‌లో చేయవద్దని ఆదేశించింది.దాంతో షూటింగ్ ఆగిపోయింది.మళ్లీ కొత్త షెడ్యూల్‌ను మరో చోట ప్రారంభించేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.







