ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన కేజీఎఫ్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.కన్నడ సినిమా కేజీఎఫ్ 2 ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది.
కన్నడ భాషలో మాత్రమే కాకుండా తెలుగు.హిందీ.తమిళం.మలయాళం భాషల్లో కూడా విడుదల అయ్యి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.రికార్డు బ్రేకింగ్ వసూళ్ల దిశగా ఈ సినిమా దూసుకు పోతుంది.విడుదల అయ్యి వారం అవ్వబోతున్న నేపథ్యంలో ఈ సినిమా వసూళ్లు హాట్ టాపిక్ గా ఉన్నాయి.
అయిదు వందల కోట్ల వసూళ్లను ఇప్పటి వరకు ఈ సినిమా రాబట్టింది.ఇంకా కూడా ఈ సినిమా జోరు కనిపిస్తూనే ఉంది.
లాంగ్ రన్ లో ఈ సినిమా దక్కించుకోబోతున్న వసూళ్ల విషయంలో ప్రస్తుతం చర్చ హాట్ హాట్ గా జరుగుతోంది.దేశ వ్యాప్తంగా సినిమా సాధిస్తున్న వసూళ్లకు తోడు విదేశాల్లో కూడా ఈ సినిమా వసూళ్లు మామూలుగా లేవు.
అందుకే ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లను నమోదు చేయడం ఖాయం అంటూ చర్చ జరుగుతోంది.ఈ సమయంలోనే తెలుగు ప్రేక్షకులు ఆర్ ఆర్ ఆర్ సినిమా యొక్క రికార్డు స్థాయి వసూళ్లను ఎక్కడ కేజీఎఫ్ 2 క్రాస్ చేస్తుందో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేజీఎఫ్ 2 లో యశ్ హీరోగా నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమా కు కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు.దిగ్గజా లు నటించిన ఈ సినిమా వసూళ్ల విషయంలో రికార్డు ల పరంగా కూడా ఓరేంజ్ కనబర్చుతుంది.కనుక కేజీఎఫ్ 2 సినిమా ఆర్ ఆర్ ఆర్ యొక్క రికార్డుకు ఎసరు పెట్టే అవకాశాలు ఉన్నాయేమో అంటున్నారు.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధిస్తున్న వసూళ్లు ప్రతి ఒక్కరిని ఆశ్చర్య పర్చుతున్నాయి.







