ప్రస్తుతం ఏదైనా స్టార్ హీరో లేదా స్టార్ దర్శకుడి సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు అభిమానులు ఆ సినిమా గురించి ముందే అంచనాలు వేస్తుంటారు.సినిమాకు సంబంధించిన టైటిల్, భారీ బడ్జెట్, స్టార్ హీరో కాంబినేషన్ లో స్టార్ డైరెక్టర్ ఇలా మంచి క్రేజీ న్యూస్ వినిపిస్తే చాలు ఇక ఆ సినిమా విడుదలకు ముందే సక్సెస్ అందుకుంటుంది.
ఈమధ్య సినిమాలోని కథనే కాకుండా పాటలు కూడా మంచి రికార్డును సాధిస్తున్నాయి.ఎన్నో సినిమాలు ప్లాప్ లను ఎదుర్కోగా అందులో పాటలు మాత్రం మంచి సక్సెస్ లను అందుకుంటున్నాయి.
ఇక పాటల పరంగా మంచి రికార్డు అందుకోవడానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ ల ప్రాధాన్యం ఎక్కువగా ఉంది.ఇదిలా ఉంటే తాజాగా కే జి ఎఫ్ 2 సినిమా కూడా విడుదలకు ముందే ఓ రికార్డ్ ను క్రియేట్ చేసుకుంది.
కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన కే జి ఎఫ్ సినిమా ఎంత హిట్ ని అందుకుందో అందరికీ తెలిసిందే.కన్నడ, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా భారీ బడ్జెట్ ను వసూలు చేసుకుంది.
ఇక ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా మొదటి కథ సస్పెన్స్ తో ముగిసింది.ఇక ప్రస్తుతం యష్ నటిస్తున్న కే జి ఎఫ్ 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది.
పవర్ ఫుల్ యాక్షన్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను పలు భాషలలో విడుదల కానుంది.ఇక ఈసారి కూడా భారీ బడ్జెట్ తో బెట్టింగ్ లు కూడా జరిగాయి.
ఇందులో మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది.

ఇక ఈ సినిమా టీజర్ విడుదల కాగా ఎంతలా ప్రశంసలు అందుకున్నాయో చూసాం.ఈ సినిమా థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ ఓటీటీ లపై కూడా రికార్డ్ ధర పలికింది.ఇక ఈ సినిమాకు ఆడియో రైట్స్ ను లహరి, టి సిరీస్ సంస్థ ఏకంగా రూ.7.2 కోట్లకు కొనుగోలు చేశారట.ఇందులో మొత్తం ఆరు పాటలు మాస్ బీట్స్ గా ఉన్నాయని తెలుస్తుంది.కాబట్టి ఆడియో రైట్స్ ధరకు ఈ సంస్థలు ముందుకు వచ్చాయి.ఇక ఈ సినిమాను ఈనెల 16న విడుదల చేయడానికి గతంలో ప్రకటించగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.