ఆ రోజు కేజీఎఫ్ 2 నుండి బిగ్గెస్ట్ అప్‌డేట్?

కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్నాడు.

 Kgf 2 Big Update On That Day-TeluguStop.com

ఇక ఈ సినిమాలో నటించిన హీరో యశ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారి అదిరిపోయే ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు.కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను మాత్రమే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా ట్రైలర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

 Kgf 2 Big Update On That Day-ఆ రోజు కేజీఎఫ్ 2 నుండి బిగ్గెస్ట్ అప్‌డేట్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఈ సినిమా ట్రైలర్‌ను కూడా టీజర్ రిలీజ్ చేసిన తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.గతంలో మార్చి 13న 2019లో కేజీఎఫ్ చాప్టర్ చిత్ర షూటింగ్‌ను మొదలుపెడుతున్నట్లు అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, 2020 మార్చి 13న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

అయితే ఈ మార్చి 13న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేస్తారేమోనని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

మరి నిజంగానే మార్చి 13న కేజీఎఫ్ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఉండబోతుందా అనే అంశం తెలియాల్సి ఉంది.

ఇక పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో యశ్ సరసన అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.కాగా బాలీవుడ్ నటి రవీనా టండన్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

మరి మార్చి 13కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం నుండి ఎలాంటి అప్‌డేట్ వస్తుందా అనేది చూడాలి.

#Prashant Neel #KGF 2 #Yash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు