నాందేడ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్ర నాందేడ్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.అక్కడి బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.

 Key Remarks Of Telangana Cm Kcr In Nanded-TeluguStop.com

భారత్ ప్రబల శక్తిగా ఆవిర్భవించాలని కేసీఆర్ అన్నారు.స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.

కర్ణాటక ఫలితాలు చూసి కొందరు ఏదేదో మాట్లాడుతున్నారన్న ఆయన దశాబ్దాలుగా కాంగ్రెస్ గెలిస్తే ఏం జరిగిందని నిలదీశారు.ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదని, ప్రజలని తెలిపారు.

ఏటా వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందన్నారు.వ్యవసాయానికి నీరు లేక రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

దేశం మొత్తం తెలంగాణ మోడల్ అమలు కావాలని కేసీఆర్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube