గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ అటాప్సీ రిపోర్టులో కీలక విషయాలు బయటకు వచ్చాయి.అతీక్ శరీరంలో తొమ్మిది బుల్లెట్ గాయాలను గుర్తించారు.
అతీక్ సోదరుడు అష్రాఫ్ శరీరంలో ఐదు బుల్లెట్ గాయాలు ఉన్నట్లు గుర్తించారు.
అతీక్, అష్రాఫ్ కు ఐదుగురు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది.
అనంతరం నిన్న సాయంత్రం అతీక్, అష్రాఫ్ లకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.అసద్ అంత్యక్రియలు నిర్వహించిన దగ్గరే అతీక్ మృతదేహాన్ని ఖననం చేశారు.
ప్రయాగ్ రాజ్ లో అతీక్, అష్రాఫ్ లకు వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకువెళ్తుండగా జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో అతీక్, అష్రాఫ్ లు అక్కడికక్కడే చనిపోగా.
ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.







