ఏపీలో బీజేపీ కోర్ కమిటీ కీలక సమావేశం జరిగింది.ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు సోము వీర్రాజు, జీవీఎల్, కిరణ్ కుమార్ రెడ్డి, సత్యకుమార్ హాజరయ్యారు.
ఇందులో ప్రధానంగా ఇటీవల టీడీపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కోర్ కమిటీ చర్చించనుంది.అదేవిధంగా ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపైనా కోర్ కమిటీలో చర్చ జరగనుందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కోర్ కమిటీ అభిప్రాయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.కాగా ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన ఇటీవలే టీడీపీతో కూడా పోత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.







