బిఆర్ఎస్ ( Brs ) పార్టీ రాబోవు ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొంది హట్రిక్ కొట్టాలని చూస్తోంది.ఈ తరుణంలోనే ముందస్తు ఆలోచనలు చేసి టికెట్లన్నీ ప్రకటించింది.
దీంతో ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులంతా ప్రచారంలో మునిగిపోయారు.

ఇక కేసీఆర్ ( kcr )వ్యూహాలతో నాయకత్వమంతా కదులుతున్న తరుణంలో ఓవైపు అల్లుడు హరీష్ రావు( Harishrao ), మరోవైపు కొడుకు కేటీఆర్( ktr ) తెలంగాణ అంతా చుట్టుముడుతూ కార్యకర్తల్లో ప్రత్యేకమైన జోష్ పెంచుతున్నారు.గెలుపే లక్ష్యంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రతిపక్ష పార్టీలపై విమర్శల ఆస్త్రాలు కురిపిస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చిందని చెప్పవచ్చు.
ఆ వివరాలు ఏంటో చూద్దాం.దాదాపు 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్( kcr ), ఆయన రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించుకున్నారు.
ఒకటి ఆయన సిట్టింగ్ స్థానం అయినటువంటి గజ్వేల్ రెండవది కామారెడ్డి( Kamareddyy )ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటన చేశారు.ఇదే తరుణంలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయనకు గట్టి షాక్ తగలబోతోంది.

ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి లాభాన కాయతీ లంబాడీలు కేసీఆర్ ( KCR ) పై ముకుమ్మడిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.ఏకంగా 1,016 మంది పోటీ చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాన్సింగ్ తెలియజేశారు.కేసీఆర్ పై పోటీ చేసే అభ్యర్థుల వివరాలను మండలాల వారీగా ప్రకటించారు.ప్రస్తుతం ఓసీ జాబితాలో ఉన్న కాయతీ లంబాడీలను ఎస్టీ( st ) జాబితాలో చేర్చేందుకు సీఎం ఇప్పటికే హామీ ఇచ్చారని, కానీ దాన్ని నెరవేర్చుకోలేదని అందుకే ఆయనపై పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు.
అంతేకాకుండా వారికి పోడు పట్టాలు, 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇదే తరుణంలో వారు కామారెడ్డి ( kamareddy) నియోజకవర్గంలో గత కొంతకాలంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కేసీఆర్ పై పోటీ చేయాలని ఫైనల్ గా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.







