టీడీపీ ఎమ్మెల్యే పయ్యావులకు భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు ఐదుగురు లేదా ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది పేర్లు ఇవ్వాలని పిటిషనర్ కు సూచించింది.
వారిలో ఇద్దరిని సెక్యూరిటీగా నియమించేందుకు ఆదేశిస్తామని న్యాయస్థానం తెలిపింది.అయితే పిటిషనరే పేర్లు ఇవ్వాలని హైకోర్టు సూచించడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
పిటిషనర్ కు నమ్మకం ఉండాలి కదా అని ధర్మాసనం ప్రశ్నించింది.తొలుత వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు విచారణ తర్వాత టూ ప్లస్ టూ సెక్యూరిటీపై ఆదేశాలు ఇస్తామని వెల్లడించింది.







