సౌత్ ఆఫ్రికా వేదికగా మహిళల టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు మొదటి నుండి అద్భుతంగా రాణించింది.మొదటి మ్యాచ్ లోనే పాకిస్తాన్ పై అద్భుతమైన ఆట ప్రదర్శనతో ఘన విజయాన్ని సాధించింది.
ఇక వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లోను విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
రెండు వరుస విజయాలను ఖాతాలో వేసుకున్న భారత జట్టు, ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ఆటను ప్రదర్శించినప్పటికీ ఓటమిపాలైంది.
ఇంగ్లాండ్- భారత్ మ్యాచ్ తో ఓటమి దక్కించుకున్న భారత్ కచ్చితంగా ఐర్లాండ్ తో గెలిస్తేనే సెమీఫైనల్ చేరే పరిస్థితి వచ్చింది.ఐర్లాండ్- భారత్ మ్యాచ్లో విజయాన్ని ఖాతాలో వేసుకొని వరల్డ్ కప్ సెమీఫైనల్ లో అడిగి పెట్టింది భారత మహిళల జట్టు.
ఇక ప్రస్తుతం భారత్ తో సెమీఫైనల్ లో తన పడే ప్రత్యర్థి ఎవరన్నది హాట్ టాపిక్ గా మారింది.ఇక సెమీఫైనల్ లో భారత జట్టుకు అసలైన సవాల్ ఎదురు అవ్వనుంది.
సెమీఫైనల్ లో భారత్ తో తలపడేది ఆస్ట్రేలియా జట్టు.ఈనెల 23వ తేదీ ఆస్ట్రేలియా- భారత్ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.

గ్రూప్ ఎ లో వరుస నాలుగు మ్యాచ్లను గెలిచి ఎనిమిది పాయింట్లతో టాప్ లో నిలిచి ఆస్ట్రేలియా సెమీఫైనల్ లోకి అడుగు పెట్టింది.గ్రూప్ బి లో మూడు మ్యాచ్లను గెలిచి ఆరు పాయింట్లతో సెమీఫైనల్ లోకి అడుగు పెట్టింది భారత్.గ్రూప్ ఎ లో మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, గ్రూప్ బి లో రెండో స్థానంలో ఉండే భారత్ తో తెలపండి.

ఇక గ్రూప్ బి లో టాప్ లో ఉండే ఇంగ్లాండ్, గ్రూప్ ఎ లో రెండో స్థానంలో ఉండే టీం తో పోటీ పడనుంది.ఇప్పటిదాకా 5 వరల్డ్ కప్ లను సాధించిన ఆస్ట్రేలియా మహిళల జట్టును భారత మహిళల జట్టు ఓడించాలంటే చాలా కష్టమే.సెమీఫైనల్ లో విజయం సాధించాలంటే అద్భుతమైన ఆట తీరు ను ప్రదర్శించాల్సిందే.







