ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం అయింది.ఈ క్రమంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇందులో భాగంగా ఈ -కోర్ట్స్ మిషన్ మోడ్ ఫేజ్ -కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
రూ.7,210 కోట్ల ఖర్చుతో ప్రాజెక్టును చేపడతామని కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.పేపర్ లెస్ కోర్టులతో పాటు ఈ-ఫైలింగ్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, లైవ్ స్ట్రీమింగ్, క్లౌడ్ స్టోరేజీ సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
న్యాయవ్యవస్థ మరింత పారదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు.ఇప్పటికే 18 వేలకు పైగా కోర్టులను కంప్యూటరైజ్డ్ చేశామని వెల్లడించారు.హార్డ్ వేర్, నెట్ వర్క్ సదుపాయాలు కూడా కేంద్రం కల్పిస్తుందన్నారు.వచ్చే మూడేళ్లలో కొత్తగా 75 లక్షల ఉజ్వల కొత్త కనెక్షన్లు ఇస్తామని తెలిపారు.
డిపాజిట్ లేకుండా ఉజ్వల కనెక్షన్లను అందజేస్తామని వెల్లడించారు.