లోకేష్ ఢిల్లీ పారిపోయారు అంటూ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్ర రాజకీయాలు చాలా రసవతరంగా ఉన్నాయి.

ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు కూడా టైం లేకపోవడంతో ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారు తమ వ్యూహాలతో సిద్ధమవుతున్నారు.

మరోపక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ అరెస్టు పట్ల తెలుగుదేశం నేతలు వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

పరిస్థితి ఇలా ఉంటే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో లోకేష్( Lokesh ) నీ సీఐడీ అధికారులు రెండు రోజుల నుండి విచారిస్తూ ఉన్నారు.ఈ క్రమంలో లోకేష్ పై వైసీపీ మంత్రులు నాయకులు రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు.

కచ్చితంగా ఈ కేసులో లోకేష్ అరెస్ట్ అవుతారని నిన్న మంత్రి గుడివాడ అమర్నాథ్( Mantri Gudivada Amarnath ) తెలియజేయడం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా లోకేష్ ఢిల్లీ పర్యటనలపై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ లో సంచలన పోస్ట్ పెట్టారు.

Advertisement

"ఢిల్లీ బయలుదేరిన నారా లోకేష్.కాదు.

కాదు పారిపోయిన లోకేష్" అంటూ సెటైర్ వేశారు.రెండో రోజు విచారణ ముగిసిన అనంతరం లోకేష్ ఢిల్లీ బయలుదేరడం జరిగింది.

అనంతరం అంబటి రాంబాబు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది.

నేడు టిడిపి లోకి ఆళ్ల నాని ? జగన్ సన్నిహితులంతా ఎందుకిలా ? 
Advertisement

తాజా వార్తలు