విపక్షాన్ని అయినా ఎదుర్కోవచ్చు కానీ స్వపక్షం లోనే ఉండి కామెంట్స్ చేసే వారితో వేగేది చాలా కష్టం.ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ పార్టీ కి గుడ్ బై చెప్పడం తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న చంద్రబాబు కి టీడీపీ ఎంపీ కేశినేని నాని పెద్ద తలనొప్పిగా మారారు.
రోజుకో పేస్ బుక్ పోస్ట్ తో ఆసక్తిరేపుతున్నారు నాని.పార్టీ నేతలను,అధిష్టానాన్ని టార్గెట్ చేస్తూ తాజాగా పోస్ట్ లు చేయడం రాజకీయ దుమారం రేపుతోంది.
గత కొద్దీ రోజులుగా టీడీపీ తో ఆంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న కేశినేని నాని ఇతర పార్టీ లపై,నేతలపై కామెంట్లు పెడుతూ వచ్చారు.అయితే సొంత పార్టీ పై ఆయనకు కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ పెద్దగా ఆ విషయాన్నీ వెల్లడించకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా సొంత పార్టీ పైనే పోస్ట్ ను గురి పెట్టారు.
కేశినేని తన పోస్ట్‌లో ‘టీడీపీకి టాస్క్ మాస్టర్లు కావాలి.షో మాస్టర్లు వద్దూ’అంటూ హితవు పలికారు.
అంటే పార్టీలో షో మాస్టర్లకు అవకాశం ఇవ్వొద్దు.టాస్క్ మాస్టర్లు కావాలంటూ పార్టీ అధిష్టానానికి సూచన చేసినట్లు అయ్యింది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన కేశినేని కి చంద్రబాబు పార్లమెంట్ లో విప్ పోస్ట్ అప్పగించినా ఆ పోస్ట్ కు నేను అర్హుడని కాను,అర్హులు అయిన వారికి ఆ పోస్ట్ ఇవ్వాలి అంటూ ఆయన సున్నితంగా తిరస్కరించారు.

అయితే అప్పటి నుంచి కూడా ఆయన సొంతపార్టీ పై అసంతృప్తి తో ఉన్నారని,త్వరలో పార్టీ మారె ఆలోచనలో ఉన్న కారణంగా ఆయన పోస్ట్ ను తిరస్కరించారు అంటూ తెగ ప్రచారం జరిగింది.అయితే ఇప్పటివరకు ఆయన పార్టీ మారతారా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు కానీ ఆయన మాత్రం సొంత పార్టీ నే టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పెట్టడం తీవ్ర చర్చకు దారి తీస్తుంది.సొంత పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాపై పోస్ట్‌తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
దీంతో అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి బుజ్జగించడంతో మెత్తబడ్డారు.పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు కానీ మళ్లీ ఇప్పుడు మరో పోస్ట్‌తో నాని మరోసారి వార్తల్లో నిలిచారు.