ఈ మధ్యకాలంలో సిని ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వారి జీవితంలో ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి ఏదో ఒక సందర్భంలో బయట పెడుతూనే ఉన్నారు.కాగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు ఎదురైన చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలలో భాగంగా వారికి జరిగిన భయంకరమైన ఘటనల గురించి చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక నటుడు ఒక దర్శకురాలి పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే మనం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోయిన్లను దర్శక నిర్మాతలు వేధించారు అంటూ వార్త వింటూ ఉంటాం.కానీ ఇక్కడ పూర్తి విరుద్ధంగా ఒక దర్శకురాలు ఒక నటుడిని వేధించింది అంటూ నటుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.కేరళకు చెందిన దర్శకురాలి పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది.
ఒక డర్టీ పిక్చర్లో నటించమని తనను బలవంతం చేసింది అంటూ ఒక బుల్లితెర నటుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.కాగా త్వరలోనే ఓటీటీ లో రిలీజ్ కాబోతున్న ఆ సినిమాను ఆపాలి అని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు సదరు బుల్లితెర నటుడు.

లేదంటే తనకు మరణమే సరైన మార్గం అని ఫిర్యాదులో వాపోయాడు.ఈ సందర్భంగా ఆయన సదరు నటుడు మాట్లాడుతూ.అది నా తొలి షూటింగ్.నేను అగ్రిమెంట్ సరిగా చదవకుండానే సంతకం పెట్టి వారితో కలిసి షూటింగ్ కు వెళ్లాను.అప్పుడు వారు చివరకు నన్ను ఒక గదిలోకి తీసుకెళ్లి ఇది అడల్ట్ మూవీ ఇందులో నువ్వు నగ్నంగా నటించాలని చెప్పడంతో నేను కుదరదు అని చెప్పాను.అప్పుడు వాళ్లు అగ్రిమెంట్ మీద సంతకం చేసావు.
కాబట్టి చేసి తీరాల్సిందే ఒకవేళ అగ్రిమెంట్ బ్రేక్ చేయాలి అనుకుంటే 5 లక్షల రూపాయలు కట్టమని బెదిరించారు అని చెప్పుకొచ్చాడు సదరు బుల్లితెర నటుడు.అయితే అదే ఒక మారుమూల ప్రాంతం కాబట్టి నేను అక్కడి నుంచి తప్పించుకోలేకపోయాను అని సదరు బాధితుడు తన ఫిర్యాదులు చెప్పుకొచ్చాడు.
ఒకవేళ ఆ సినిమా రిలీజ్ అయితే తన తండ్రి తండ్రులకు స్నేహితులకు ముఖం చూపించుకోలేను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.







