తెలుగు సినీ ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆరోహి రావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం తెలుగులో ఒకసారి మొత్తం బిగ్ బాస్ సీజన్ 6 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆరోహి రావు ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.
అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లక ముందు వరకు యాంకర్ గా తెలంగాణ భాషలో మాట్లాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆరోహి బిగ్ బాస్ హౌస్ కి వెళ్లిన తర్వాత మరింత పాపులారిటీని సంపాదించుకుంది.ఇకపోతే ఆరోహీ రావు ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటుంది.
ఎంత పెద్ద గొడవ అయినా వెనకడుగు వేయకుండా చివరి వరకు పోరాడుతూ ఉంటుంది.బిగ్ బాస్ హౌస్ లో ఈమె సూర్యతో కలిసి చేసిన ఫ్రెండ్షిప్ విషయంలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఆరోహి రావు సూర్య మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ లేక ప్రేమనా అన్నది తెలుసుకునే లోపే ఆమె ఊహించని విధంగా ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది.అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చినప్పటికీ ఆరోహి రావు కి సూర్య కి మధ్య సంబంధం గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ఈమె తాజాగా తన అభిమానులతో ముచ్చటించగా అందులో కొందరు బిగ్ బాస్ హౌస్ లో సూర్య నీది ఫ్రెండ్షిప్ హద్దులు మీరింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ నీకు పొలం పనే కరెక్ట్.బిగ్ బాస్ ఎందుకు.పో పోయి పొలం పని చేసుకో అంటూ ఆమెను అవమానించే విధంగా మాట్లాడాడు.ఇదే విషయాన్ని ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేస్తూ సదరు నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది ఆరోహి రావు.తమ్మీ.
ఆ పొలాల్లో పని చేసేటోళ్లు లేకపోతే నువ్వు అడుక్కు తినాలన్నా అన్నం దొరకదు అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది.