ఇండియాలో అతిపెద్ద బ్యాక్ వాటర్ సరస్సు.. ఎక్కడ ఉందో తెలుసా?

భారతదేశం ప్రకృతి సంపదలకు నిలయం.అందులో జలపాతాలు ముందువరుసలో ఉంటాయి.

 Kerala Vembnad Lake Indias Largest Back Water Lake Details, Indian, Back Water R-TeluguStop.com

దేశంలోనూ కాదు ప్రపంచ దేశాల్లో జలపాతాలకు డిమాండ్ ఎక్కువే.చాలా మంది వాటి గురించే ఎక్కువగా వెతుకుతుంటారు.

జలపాతాల దగ్గరకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ తమ వయస్సును మరిచిపోయి ఆ నీటితో ఆడుకోవడం మొదలుపెడతారు.అలాగే బ్యాక్ వాటర్ ని కూడా చాలా మంది ఇష్టపడతారు.

ఈ బ్యాక్ వాటర్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం.

కొన్ని కాలువలు, సరస్సులు సముద్రానికి ఆనుకొని ఉన్న భూభాగంలో ఏర్పడి ఉంటాయి.

వాటిని బ్యాక్ వాటర్ అని అంటారు.ఈ బ్యాక్ వాటర్ ని తెలుగులో కయ్యలు, తమిళంలో ‘కాయల్’, ‘కళి’, ‘ఉప్పళం’, మలయాళంలో ‘కాయలు’ అని పిలుస్తంటారు.

ఈ కయ్యలు అనేవి ఎక్కడో ఓక చోట సముద్రంలో కలుస్తాయి.దీంతో ఈ నీరు ఉప్పగా ఉంటాయి.వీటిని ఉప్పు నీటి కయ్యలు అని కూడా అంటారు.

ఇక భారతదేశంలో కేరళ రాష్ట్రం కయ్యలకు ప్రసిద్ధి చెందింది.

కేరళలో మొత్తం 34 కయ్యలు ఉన్నాయి.అందులో వెంబనాడు సరస్సు ఒకటి.

Telugu River, Watter, India, Indian, Keralavembnad, Lake, Salt-General-Telugu

ఇది దేశంలో అతి పొడవైన మరియు కేరళలో అతిపెద్ద సరస్సు.పశ్చిమ బెంగాల్ లోని సుందర్ బన్స్ తర్వాత ఇది రెండో అతిపెద్ద రామ్ సర్ సైట్ గా పరిగణించబడుతుంది.వెంబనాడ్ సరస్సు దాదాపు 96 కి.మీ.పొడువు, గరిష్టంగా 14 కి.మీ వెడల్పుతో 2000 చ.కి.మీ పైగా ఉంటుంది.అందుకే ఈ కయ్య ఒక సముద్రములా ఉంటుంది.అయితే ఈ కయ్య మొత్తం ఉప్పు నీరుగా ఉండదు.నది వద్ద మంచి నీరుగా, సముద్రం దగ్గరవుతున్న కొద్దీ ఉప్పు నీరుగా ఉంటుంది.కొన్ని ప్రాంతాల్లో ఈ నీటితో వ్యవసాయం కూడా చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube