మనిషిలో ఏదైనా సాధించాలి అనే పట్టుదలతో పాటు అందుకు తగ్గ కృషి ఉంటే సాధించలేనిది ఏది ఉండదని కేరళకు( Kerala ) చెందిన ఓ కుర్రాడు నిరూపించాడు తన వద్ద ఉన్న మారుతి 800 కారును( Maruti 800 ) లగ్జరీ కారు రోల్స్ రాయిస్ గా మార్చేశాడు.ఈ కారు తయారు చేయడానికి రూ.45000 ఖర్చు అయ్యింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పలువురు ప్రశంసిస్తున్నారు.

కేరళకు చెందిన 18 ఏళ్ల హాదీఫ్ కు( Hadeef ) మామూలు కార్లను విలాసవంతమైన కార్ల లాగా మోడీపై చేయడం అంటే చాలా ఇష్టం.రోల్స్ రాయిస్( Rolly Royce ) తరహాలో కారు ముందు భాగంలో పెద్ద సైజు గ్రిల్ అమర్చాడు.కారుకు మెరుగైన ఇంటీరియర్స్, LED DRL లు, పెయింట్ జాబ్ తో ఇంప్రెసివ్ గా తయారు చేశాడు.స్పిరిట్ ఆఫ్ ఎక్స్ టసీ అని రాసి ఉన్న కార్ బానెట్ ని కూడా తయారు చేసి కారుకు అందించాడు.
ఈ యువకుడు గతంలో కూడా మోటార్ సైకిల్ ఇంజన్ ఉపయోగించి జీపును తయారు చేశాడు.

తాను ఆకర్షణీయమైన కారణం చాలా సులువుగా తయారు చేయగలనని వెల్లడించాడు.ఈ కుర్రాడు తయారుచేసిన కారు సోషల్ మీడియాలో కేవలం ఐదు రోజుల లోపే దాదాపుగా ఐదు లక్షల వ్యూస్ సంపాదించింది.యూట్యూబ్ ఛానల్ ట్రిక్స్ ట్యూబ్ ఈ వీడియోను షేర్ చేసింది.
సోషల్ మీడియా పాపులర్ అయ్యాక చాలామంది తమలోని ప్రతిభను ప్రపంచానికి చూపించి ప్రశంసలు పొందుతున్నారు.ఈ తరహా లోనే శ్రీనగర్ కు చెందిన ఓ ఉపాధ్యాయుడు బిలాల్ అహ్మద్ చెత్త నుండి సౌర శక్తితో నడిచే కారును తయారు చేసి నెటిజన్స్ ప్రశంసలు పొందాడు.







