తెలంగాణ రాష్ట్రంలో( Telangana ) మరికొద్ది నెలలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం తెలంగాణ నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్.
( Pawan Kalyan ) ఎన్నికలకు సిద్ధపడాలని నేతలకు తెలియజేయడం జరిగింది.నేడు 32 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయబోతున్నట్లు లిస్ట్ విడుదల చేశారు.
ఆ లిస్టు బట్టి చూస్తే.కూకట్ పల్లి, ఎల్బీనగర్, నాగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, సనత్ నగర్, కొత్తగూడెం, ఉప్పల్, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘన్ పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్ నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మేడ్చల్, మల్కాజ్ గిరి, ఖానాపూర్, పాలేరు, ఇల్లందు, మధిరలో జనసేన పోటీ చేయనుంది.

పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) చేయబోతున్నట్లు తెలంగాణ జనసేన ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.ఐదు రోజుల క్రితం తెలంగాణలో పోటీ చేయాలని పవన్ సూచించారని తెలిపారు.ఎన్నికల సమయానికి మార్పులు ఉంటే పవన్ సూచిస్తారని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర అనేక సంచలనాలు సృష్టిస్తోంది.
వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను లేవనెత్తుతూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.ఈ క్రమంలో తెలంగాణలో కూడా పవన్ వారాహి యాత్ర చేయబట్టబోతున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.







