కేర‌ళ బాధితుల గురించి అతను ఎంత నీచంగా కామెంట్ చేసాడో తెలుసా.? కండోమ్స్ సాయం చేయొచ్చా అంట.!

కేర‌ళ‌లో ప్ర‌కృతి విప‌త్తు, వ‌ర‌ద‌ల స‌మ‌యంలో జాతీయ స్థాయిలో ప్ర‌జ‌లు కుల మత బేధాలు లేకుండా స్పందిస్తున్నారు.త‌మ స్థాయికి త‌గ్గ‌ట్టు విరాళాలు ఇస్తున్నారు.

 Kerala Man Fired From Oman Job For Offensive Comments On Kerala Flood-TeluguStop.com

కొంద‌రు ఐదు రూపాయ‌లు ఇస్తున్నారు కొందరు ల‌క్ష రూపాయ‌లు .హీరోలు, సామాన్యులు, మంత్రులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఉద్యోగం లేని వాళ్లు.ఇలా ఎవ‌రికి తోచిన విధంగా వారు స‌హాయం చేస్తున్నారు.

కేర‌ళ‌కు చెందిన రాహుల్ చెరు ప‌ళ‌య‌ట్టు అనే వ్య‌క్తి చేసిన కామెంట్ మీకు కూడా కోపం తెప్పిస్తుంది.కేర‌ళ‌ స‌హాయార్థం స‌హాయం చేసుకోవ‌డం, సంప్ర‌దింపుల‌కు సంబంధించిన ఒక సోష‌ల్ మీడియా పోస్టు.అందులో కొంత మంది వివిధ అంశాలు, వివ‌రాలు చ‌ర్చించుకుంటున్నారు.

అంటే ఎలా డొనేట్ చేయాలి… ఎం ఇవ్వాలి.ఎవ‌రినికి సంప్ర‌దించాలి… ఎక్క‌డ స‌మ‌స్య ఉంది వగైరా.

కానీ ఇత‌ను మాత్రం చాలా దారుణంగా కామెంట్ చేశాడు.

సానిటరీ నాప్కిన్స్ సహాయం చేయొచ్చా అని ఓ వ్యక్తి అడిగితె…రిప్లై ఇస్తూ కండోమ్ ఇవ్వొచ్చా అని అసభ్య కామెంట్స్ చేసాడు ఆ ప్రబుద్దుడు.పోస్టులో రిప్లై ఇస్తూ.కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కు ఉప‌శ‌మ‌నం కోసం కాండోమ్స్ పంపించ‌మంటారా? అని కామెంట్ చేశాడు.అతని ప్రవర్తనపై నెటిజెన్ల ఫైర్ అవుతున్నారు.చివ‌రికి అత‌ను ఓమ‌న్ దేశంలో అత‌ను ప‌ని చేస్తున్న లూలూ అనే షాపింగ్ మాల్ క‌మ్ హాస్పిటాలిటీ సంస్థ‌కు కూడా ఈ విష‌య తెలిసింది.

వాళ్లు వెంట‌నే.ఇలాంటి సంస్కారం లేని వ్య‌క్తికి మ‌న సంస్థ‌లో చోటు క‌ల్పించ‌రాదు అని వెంట‌నే అత‌ణ్ణి ఉద్యోగం నుంచి తీసేసి గుణపాఠం నేర్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube