కేరళ దర్శకురాలిని అరెస్టు చేసిన పోలీసులు.. ఆ నటుడిని వేధింపులకు గురి చేయడంతో?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులకు వేధింపులు ఎదురవుతూనే ఉంటాయి.కేవలం ఆడవారికి మాత్రమే కాకుండా మగవారికి కూడా వేధింపులు ఎదురవుతూ ఉంటాయి.

కమిట్మెంట్ ను కోరడం లేదంటే వీడియోలలో నటించమని బలవంతం చేస్తూ ఉంటారు.తాజాగా అటువంటి ఘటనే ఒకటి సినిమా ఇండస్ట్రీలో వెలుగులోకి వచ్చింది.

దాంతో ఒక లేడీ డైరెక్టర్ పై నటుడు వేధింపుల కేసు పెట్టడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్శకురాలని అరెస్టు చేశారు.అసలేం జరిగిందంటే.

మాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన లక్ష్మీ దీప ఇప్పుడిప్పుడే దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకుంటోంది.ఇప్పటికే ఆమె పలు సినిమాలను తెరకెక్కించింది.ఆమె తీసిన ఓ వెబ్‌ సిరీస్‌ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించి ఓ నటుడు సంచలన ఆరోపణలు చేశాడు.ఏకంగా డైరెక్టర్‌ లక్ష్మీ దీపపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తిరువనంతపురానికి చెందిన ఆ నటుడు తన ఫిర్యాదులో.డైరెక్టర్‌ లక్ష్మీ దీప ఓ వెబ్‌ సిరీస్‌ కోసం నన్ను సంప్రదించింది.

నన్ను అందులో హీరోగా చేస్తానని అంది.ఆ సిరీస్‌లో లీడ్‌ రోల్‌ ఇస్తానని చెప్పటంతో పాటు కొన్ని సీన్లను కూడా నాపై చిత్రీకరించింది.

తర్వాత నాతో బలవంతంగా పాడు సీన్లలో నటించేలా చేసింది అని తెలిపాడు.ఆ వెబ్‌ సిరీస్‌ కు షూటింగ్‌ అరువిక్కురలోని ఓ ఫ్లాట్‌లో 2022లో చోటుచేసుకుంది.కాంట్రాక్ట్‌ పేరు చెప్పి నాతో బలవంతంగా ఆ సీన్లు చేయించింది అని సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.అయితే, పోలీసులు లక్ష్మీ దీపపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.దీంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు.

Advertisement

దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు.కోర్టులో హాజరుపరిచారు.

కోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది.

తాజా వార్తలు