మైఖేల్ జాక్సన్( Michael Jackson ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ పాప్ స్టార్ డ్యాన్స్‌తో పాటు తన అద్భుతమైన సింగింగ్ తో యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు.
ఇప్పటికీ అతని పాటలు వింటూ, ఆ పాటలకు డ్యాన్స్ చేసేవారు కోట్ల సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.ఇండియాలో కూడా ఎంజేకి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తాజాగా కేరళకు( Kerala ) చెందిన ఒక డాన్స్ గ్రూప్ మైకల్ జాక్సన్ పాటకు అద్భుతంగా నాట్యం చేశారు.అయితే వీరు మైకల్ జాక్సన్ వలె కోటు, ప్యాంటు వేసుకోకుండా లుంగీలు( Lungi ) కట్టుకొని డ్యాన్స్ చేశారు.74xmanavalans అని పిలిచే ఈ బృందం కేరళ సాంప్రదాయ సంస్కృతిని పాప్ సంగీతంతో మిళితం చేసి చాలా బాగా స్టెప్పులు వేశారు.
ఈ బృందంలో జీవ్, విజీష్ విచు, రాకేష్ రక్కు, తాజ్జు రాజిల్ అనే నలుగురు నృత్యకారులు ఉన్నారు.వీరు లుంగీలు, సాధారణ చెప్పులు ధరించి మైఖేల్ జాక్సన్ “బిల్లీ జీన్” ( Billie Jean Song ) పాటకు అద్భుతంగా స్టెప్పులు వేశారు.బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ “బ్యాక్‌స్ట్రీట్స్ బ్యాక్ ఆల్రైట్”కి సంబంధించిన వారి ఇతర డ్యాన్స్ పర్ఫామెన్స్ లు కూడా బాగా వైరల్ అయ్యాయి, వారి నైపుణ్యం, వారి నృత్యాలలో లుంగీ ధరించిన క్రియేటివిటీ చాలామందిని ఆకట్టుకున్నాయి.
వీరి వీడియోలకు లక్షల్లో వ్యూస్, లైక్స్ వచ్చాయి.
వీరు ఈ వీడియోలు వారి వినూత్నమైన కొరియోగ్రఫీ, ట్రెడిషనల్, మోడ్రన్ డ్యాన్స్ స్టైల్స్‌తో కలిపారు.వీరు ఇండియాస్ గాట్ టాలెంట్, అమెరికాస్ గాట్ టాలెంట్ వంటి టాలెంట్ షోలలో కూడా పాల్గొనవచ్చని నెటిజన్లు సూచించారు.వేరే అదిరిపోయే డాన్స్ వాయిస్ చూడాలంటే వీడియోపై మీరు కూడా క్లిక్ చేయండి.