యూఏఈలో భారతీయ దంపతుల మృతి: భార్య మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన భర్త

భార్యను అపురూపంగా చూసుకునే భర్తలు మన సమాజంలో కోకొల్లలు.

వారికి ఏ చిన్న కష్టం వచ్చినా భరించలేని వారు, తనతో కష్టసుఖాల్లో పాలు పంచుకుని అర్థాంతరంగా తనను వదిలివెళ్తే తట్టుకోగలరా.

యూఏఈలోని భారతీయ కుటుంబంలో అచ్చం ఇలాంటి సంఘటనే జరిగింది.అనారోగ్యంతో భార్య మరణించగా దీనిని భరించలేని భర్త కూడా ఐదు రోజుల్లోనే ప్రాణాలు విడిచాడు.

కేరళకు చెందిన హబీబ్ రెహమాన్ (66)‌ 43 ఏళ్ల క్రితం షార్జాకు వలస వచ్చి ఇక్కడి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు.ఈ నేపథ్యంలో 1985లో ఆయనకు సోఫియా (57)తో వివాహం జరిగింది.

వీరికి ముగ్గురు పిల్లలు.ఈ క్రమంలో ఏప్రిల్ 18వ తేదీన సోఫియా గుండెపోటుకు గురవ్వడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

Advertisement

అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన హబీబ్ షాక్‌కు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.

దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా సరిగ్గా 5 రోజుల తర్వాత ఏప్రిల్ 23వ తేదీన రెహమాన్ కన్నుమూశారు.రోజుల వ్యవధిలో తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో వారి పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తల్లిదండ్రుల అంత్యక్రియలను ఒకే చోట చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్ధితుల కారణంగా సోఫియాను అల్ ఖ్వోజ్‌లో, హబీబ్‌ను షార్జాలో ఖననం చేసినట్లు వారు వెల్లడించారు.మరోవైపు సోఫియా, హబీబ్ దంపతులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఫలితాల్లో ఇద్దరికి నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు.

కాగా యూఏఈలో ఇప్పటి వరకు 10,349 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా, 76 మంది మరణించారు.

జాక్ పాట్ కొట్టిన మేస్త్రి.. నెలకు కోటి చొప్పున 30 ఏళ్ల వరకు..
Advertisement

తాజా వార్తలు