న్యాచురల్ స్టార్ నాని నుండి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటారు.ఎందుకంటే ఈయన మొదటి నుండి విభిన్న కథలతో విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టు కుంటూ వచ్చాడు.
ఇక నాని ప్రెజెంట్ చేస్తున్న సినిమా ‘దసరా’.శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా నుండి ధూమ్ ధామ్ దోస్తానా అనే మాస్ సాంగ్ ను రిలీజ్ చేసిన విషయం విదితమే.ఈ పాట పూర్తిగా తెలంగాణ స్లాంగ్ లో సాగుతూ ఆడియెన్స్ ను అలరించింది.
నాని చేసిన మాస్ స్టెప్పులు అందరిని ఆకట్టుకున్నాయి.ఇక ఇప్పుడు ఇదే పాటకు కీర్తి సురేష్ కాలు కదపడంతో ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
ఈ పాటకు కీర్తి సురేష్ లుంగీ కట్టుకుని మరీ స్టైలిష్ అండ్ మాస్ లుక్ లోకి మారిపోయి గాగుల్స్ పెట్టుకుని తన దోస్త్ తో చేతులు కలిపి మాస్ స్టెప్పులతో అదిరిపోయే విధంగా డ్యాన్స్ వేసింది.ఈ వీడియో నెట్టింట అలరిస్తుంది.
ఇక ఈ సినిమాలో నానితో పాటు కీర్తి సురేష్ కూడా డీ గ్లామర్ లుక్ లోనే నటిస్తున్నారు.
నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇప్పటికే పూర్తి చేసుకుని ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది.గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ రూపొందిస్తున్నారు.
ఇక ఈ సినిమా 2023 మార్చి 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేసారు.