కీర్తి సురేష్.(Keerthy Suresh) ఈ పేరుకు ముందు మహానటి అనే పేరు ఉంటేనే ఈమెకు ఎక్కువ గుర్తింపు వస్తుంది.
ఎందుకంటే మహానటి సావిత్రి బయోపిక్ లో నటించి మహానటి గా ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోయింది.ఇక అప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించినా రాని స్టార్డం మహానటి (Mahanati) సినిమాతో కీర్తి సురేష్ కి లభించింది అని చెప్పుకోవచ్చు.
అయితే అలాంటి కీర్తి సురేష్ ముందుగా మలయాళం లో గీతాంజలి అనే సినిమాతో సినిమాల్లోకి వచ్చింది.ఆ తర్వాత తెలుగు,తమిళ, భాషల్లో రాణిస్తోంది.
ఇక అలాంటి ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో చిరంజీవి హీరోగా వచ్చిన భోళా శంకర్ సినిమాలో Bhola Shankar చిరంజీవి చెల్లెలుగా నటించినప్పటికీ ఈ సినిమా అట్టర్ ప్లాఫ్ అయ్యింది.
ఇక ఇదంతా పక్కన పెడితే చాలా మంది హీరోయిన్లు బ్యాగ్రౌండ్ ఉంటేనే రాణించగలుగుతారు అని నమ్ముతుంటారు.
అయితే కొంతమందికి బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వక తప్పదు.అయితే కీర్తి సురేష్ తల్లి ఒకప్పటి నటి మేనక(Menaka) అనే సంగతి అందరికీ తెలుసు.
ఇక తన తల్లి హీరోయిన్ అయినప్పటికీ కూడా కీర్తి సురేష్ ఇండస్ట్రీకి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడిందట.

ఇక ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కీర్తి సురేష్ కి ఒక స్టార్ డైరెక్టర్( Star Director ) పిలిచి అవకాశం ఇస్తానని రమ్మన్నారట.అయితే అది నిజమని నమ్మిన కీర్తి సురేష్ ఆడిషన్ కి వెళ్ళిందట.అయితే కీర్తి సురేష్ కటౌట్ మొత్తం చూసిన టాలీవుడ్ డైరెక్టర్ నా కోరిక తీరిస్తే ఈ బిగ్ ప్రాజెక్టులో అవకాశం నీదే అంటూ మొహం మీద చెప్పారట.

ఇక అప్పటివరకు ఎంతో హ్యాపీగా వెలిగిపోయినా కీర్తి సురేష్(Keerthy Suresh) మొఖం ఆ డైరెక్టర్ మాటలతో ఒక్కసారిగా కోపం కళ్ళల్లో నుండి బయటపడి ఇంకొకసారి ఎవరితో అయినా ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పుతో కొడతా అంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిందట.ఇక కీర్తి సురేష్ మాటలకు ఆ డైరెక్టర్ ఒక్కసారిగా హడలిపోయారట.అలాగే కీర్తి సురేష్ ఆ సినిమా వద్దు ఏమి వద్దు అని అక్కడినుండి వెళ్ళిపోయిందట.







