సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉంటూ వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు ప్రభాస్(Prabhas).ఈయన తన పర్సనల్ విషయాలకు సంబంధించిన దేన్నీ కూడా అంతగా పట్టించుకోరు.
మరీ ముఖ్యంగా 40 ఏళ్ళు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నారు.ఇక పెళ్లి విషయం వచ్చేసరికి ఏదో ఒక మాట చెబుతూ దాన్ని దాట వేస్తూ ఉంటారు.
ఇక ప్రభాస్ ఇండస్ట్రీకి పరిచయం అయింది తన పెదనాన్న కృష్ణంరాజు (Krishnam Raju) ద్వారానే.సొంత తండ్రి కంటే ఎక్కువగా కృష్ణంరాజు ప్రభాస్ ని చూసుకున్నారు.
అలాగే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవికి కూడా ప్రభాస్ అంటే చాలా ప్రేమ.
ఇక ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చనిపోయాక ప్రభాస్ శ్యామల దేవి (Shyamala Devi) ఇద్దరు చాలా ఎమోషనల్ అయ్యారు.
అంతేకాదు ప్రభాస్ తన చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాకే తాను కూడా పెళ్లి చేసుకుంటానని పెద్దమ్మ శ్యామల దేవికి చెప్పినట్టు వార్తలు వినిపించాయి.అయితే తాజాగా శ్యామల దేవి ప్రభాస్ ని నమ్మకద్రోహి అని చెప్పింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.

మరి కొడుకు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్న ప్రభాస్ శ్యామలాదేవి కృష్ణంరాజును ఏ విషయంలో మోసం చేశారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.ప్రభాస్ (Prabhas) ని శ్యామల దేవి నమ్మకద్రోహి అంటే కోపంతో అన్న మాటలు కాదు.కృష్ణంరాజుకి శ్యామల దేవికి వాళ్లు కోరుకున్న కోరిక తీరుస్తానని మాట ఇచ్చారట ప్రభాస్.అదేంటంటే పెళ్లి చేసుకుంటానని.కానీ ప్రభాస్ పెళ్లి( Prabhas Marriage ) కాకముందే కృష్ణంరాజు చనిపోయారు.

దాంతో కృష్ణంరాజు ప్రభాస్ పిల్లలతో ఆడుకోవాలి అనే కోరిక తీరకుండానే మరణించారు.అయితే కృష్ణంరాజు బతికున్న సమయంలో పెళ్లి విషయం గురించి ప్రస్తావన వస్తే ప్రభాస్ అప్పుడు చేసుకుంటా ఇప్పుడు చేసుకుంటా అంటూ దాన్ని దాటవేస్తూ వచ్చాడు.ఈ విషయంలో మాకు నమ్మకద్రోహం చేశాడు అంటూ ప్రభాస్ పెద్దమ్మ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం శ్యామల దేవి మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.








