నందమూరి బాలకృష్ణ( Balakrishna ) ఈ దసరా కి భగవంత్ కేసరి సినిమా( Bhagavanth kesari movie ) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అక్టోబర్ 19న విడుదల కాబోతున్న భగవంత్ కేసరి సినిమా పై అంనాలు భారీగా ఉన్నాయి.
బాలయ్య గత చిత్రాలు అఖండ మరియు వీరసింహారెడ్డి భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.అందుకే భగవంత్ కేసరి సినిమా తో భారీ విజయం దక్కబోతుంది అంటూ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.

హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal )నటించగా కీలక పాత్రలో స్టార్ హీరోయిన్ శ్రీ లీల( Sreeleela ) నటించిన విషయం తెల్సిందే.హీరోయిన్ గా కాజల్ కి ఇది రీ ఎంట్రీ అనే విషయం తెల్సిందే.బాలయ్య భగవంత్ కేసరి సినిమా తో హ్యాట్రిక్ కొడితే సీనియర్ హీరోల్లో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్న వాడు అవ్వబోతున్నాడు.సీనియర్ స్టార్ హీరోలు అనగానే మనకు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు గుర్తుకు వస్తారు.
ఈ నలుగురు కూడా ఇంకా హీరోలుగా సినిమాలు చేస్తున్నారు.బాలయ్య ఈ నలుగురిలో భగవంత్ కేసరి సూపర్ హిట్ తో అరుదైన హీరో అనిపించుకోవాలని కోరుకుంటున్నాడు.

సీనియర్ హీరోలు ఒక్క హిట్ కొడితే రెండు మూడు ఫ్లాప్ లు పడుతున్నాయి.వరుసగా రెండు హిట్స్ కొట్టిన సీనియర్ హీరోలు కరువయ్యారు.ఇలాంటి సమయంలో అఖండ, వీర సింహా రెడ్డి సినిమా లతో విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య భగవంత్ కేసరి తో ( Bhagavanth kesari movie ) హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.దాంతో అరుదైన రికార్డ్ బాలయ్య కి దక్కడం ఖాయం అన్నట్లుగా అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
ప్రస్తుతం బాలయ్య యొక్క భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి.ఆ జోరు చూస్తూ ఉంటే బాలయ్య హ్యాట్రిక్ ఖాయం అని సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు.
ఏం జరగబోతుందో చూడాలి.







