టాలీవుడ్ బాపు బొమ్మల పేరు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్తన అందంతో, నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.కీర్తి సురేష్ కు ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు.
ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.మోడలింగ్ రంగంలో కీర్తి మంచి పేరు పొందిన తర్వాత సినీ పరిశ్రమకు పరిచయం అయింది.
2000 బాలనటిగా మొదటిసారి మలయాళం పైలెట్స్ సినిమా ద్వారా వెండితెరకు అడుగు పెట్టింది.ఆ తరువాత తమిళ సినిమాలో నటించిన కీర్తి సురేష్ 2016లో నేను శైలజ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇక తను నటించిన మహానటి సినిమాలో సావిత్రి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లు నటించింది.ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బాగా ముందుంటుంది.

ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు ఎవరితో ప్రేమలో పడలేదట.కానీ తాజాగా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ సంగీత దర్శకుడు అనిరుధ్ తో దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ కాగా ఈ ఫోటోను చూసిన నేటి జనులు వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని వార్తలు వినిపిస్తున్నారు.ఈ విషయం గురించి కీర్తి సురేష్ తల్లి నటి మేనక ను అడగగా ఇదివరకే కీర్తి తండ్రి మలయాళం మీడియాతో కీర్తి గురించి స్పష్టం చేశారని తెలిపింది ఆమె.ఇదంతా పుకారని, ఇందులో ఎటువంటి నిజం లేదని కీర్తి తండ్రి సురేష్ తెలిపారు.అంతేకాకుండా కీర్తి ఎవరితోనూ ప్రేమలో లేదని, తన దృష్టంతా సినిమాలపైనేనని తెలిపారు సురేష్.
ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ బాబు సినిమాలో సర్కారు వారి పాటలో హీరోయిన్ గా నటిస్తుంది.
అంతేకాకుండా హీరో నితిన్ నటిస్తున్న రంగ్ దే సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.ఇక రజినీకాంత్ సినిమాల్లో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్ చిరంజీవి నటించనున్న రీమేక్ సినిమా లో కూడా నటించనుంది.