Suhas Keerthy Suresh : సుహాస్ కీర్తి సురేష్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ మూవీ.. ఈ కాంబో ఎవ్వరూ ఊహించలేదంటూ?

టాలీవుడ్ హీరో సుహాస్( Tollywood Hero Suhas ) గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల కాలంలో వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు సుహాస్.

 Keerthu Suresh In Suhas Uppu Kappurambu-TeluguStop.com

ముందు షార్ట్ ఫిలింస్ తో మొదలుపెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి జాతీయ అవార్డు సినిమా కలర్ ఫోటోతో గుర్తింపు తెచ్చుకుని గ్యారెంటీ మార్కెట్ ఉన్న హీరోగా ఎదుగుతున్నాడు.ఇకపోతే సుహాస్ గత ఏడాది రైటర్ పద్మభూషణ్ మూవీతో సూపర్ హిట్ అందుకుని ఇటీవలే అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు( Ambajipeta Marriage Band )తో డీసెంట్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.

త్వరలో ప్రసన్న వదనం, గొర్రె పురాణం, శ్రీరంగనీతులు, ఆనందరావు అడ్వెంచర్స్ లాంటి మూవీస్ లో నటించనున్నారు.

Telugu Keerthy Suresh, Keerthysuresh, Suhas, Tollywood, Uppu Kappurambu-Movie

ఇలా చాలా బిజీ షెడ్యూల్స్ తో డైరీ ఖాళీ లేకుండా ఉంటోంది.ఇదిలా ఉండగా సుహాస్ కు జోడిగా కీర్తి సురేష్( Keerthy Suresh ) నటించబోవడం ఖచ్చితంగా విశేషమే.మొన్నటి దాకా నాని, మహేష్ బాబు లాంటి స్టార్ల సరసన ఆడిపాడిన మహానటికి పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్ర దక్కాలే కానీ వెంటనే ఒప్పేసుకునే సంగతి తెలిసిందే.

అందులో భాగంగానే ఉప్పు కప్పురంబు చేస్తోంది.ఇది థియేటర్ మూవీ కాదు.అమెజాన్ ప్రైమ్ ఓటిటి( Amazon Prime OTT ) కోసం నిర్మించిన సినిమా.అనిల్ ఐవి శశి( Anil IV Sasi ) దర్శకత్వంలో రాధికా లావు నిర్మాతగా ప్రొడక్షన్ జరుగుతోంది.

ఇవాళ జరిగిన ప్రైమ్ ఈవెంట్ లో అఫీషియల్ గా ప్రకటించారు.సుహాస్ హాజరైనా డేట్ల సమస్య వల్ల కీర్తి సురేష్ రాలేదు.

Telugu Keerthy Suresh, Keerthysuresh, Suhas, Tollywood, Uppu Kappurambu-Movie

ఒకరకంగా సుహాస్ కి ఇది ప్రమోషన్ లాంటిదనీ చెప్పాలి.పేరున్న హీరోయిన్లతో యాక్ట్ చేయడం ఖచ్చితంగా ఇమేజ్ ని పెంచుతుంది.పైగా వైవిధమైన కాన్సెప్ట్స్, టైటిల్స్ తో ఆకట్టుకుంటున్న సుహాస్ ఈ రెండేళ్లలో సుమారు ఏడెనిమిది రిలీజులతో పలకరించబోతున్నాడు. మూడు కోట్లు రెమ్యునరేషన్( 3 Crore Remuneration ) తీసుకుంటున్నారటగా అని మొన్న ఒక ప్రెస్ మీట్ లో అడిగిన ప్రశ్నను నవ్వుతు దాటేసిన సుహాస్ డిమాండ్ చూస్తుంటే ఆ ఫిగర్ నిజమైనా ఆశ్చర్యం లేదనిపిస్తుంది.

ఇప్పటిదాకా ఇచ్చిన కమిట్ మెంట్లు కాకుండా ఇకపై నెమ్మదిగా వెళ్తానని చెబుతున్న సుహాస్ సబ్జెక్ట్ సెలక్షన్ లో ఆచితూచి అడుగులు వేయనున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube