కమల్ హాసన్( Kamal Haasan ) ఓ పక్క తను లీడ్ రోల్ చేస్తూ హీరోగా అదరగొడుతుండగా మరోపక్క నిర్మాతగా కూడా వరుస సినిమాలు చేస్తున్నారు.లేటెస్ట్ గా మామన్నన్ సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా అటెండ్ అయిన ఆయన కీర్తి సురేష్ ( Keerthy Suresh )గురించి చాలా గొప్పగా చెప్పారు.
బ్యూటీ విత్ బ్రెయిన్ అని చెప్పడం విశేషం.అంతేకాదు ఆమె ఎంచుకునే పాత్రలు కూడా చాలా బాగున్నాయని అన్నారు.
అయితే కమల్ ఈ రేంజ్ లో చెప్పాడు అంటే మరోసారి కీర్తి సురేష్ ఈ సినిమాలో తన నటనతో అలరించబోతుందని అర్ధమవుతుంది.
మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మామన్నన్ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ కథతో వస్తుంది.ఈ సినిమాలో వడివేలు లీడ్ రోల్ లో నటించగా ఉదయనిధి స్టాలిన్( Udhayanidhi Stalin ), ఫాహద్ ఫాజిల్ లు కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశారు.ఇక కీర్తి సురేష్ కూడా సినిమాలో తన సత్తా చాటనుంది.
ఈ సినిమాపై కమల్ చేసిన కామెంట్స్ ముఖ్యంగా కీర్తి సురేష్ పై చేసిన కామెంట్స్ తో దసరా వెన్నల తర్వాత కీర్తి మరోసారి అదరగొట్టడం ఖాయమని ఫిక్స్ అయ్యారు.