కే‌సి‌ఆర్ " సంచలన ప్లాన్ ".. వర్కౌట్ కాకపోతే అంతే..?

తెలంగాణలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి.

 Kcr's sensational Plan. Kcr ,karnataka Elections , Congress , Brs Party , Ts Pol-TeluguStop.com

అధికార బి‌ఆర్‌ఎస్<( Brs party ) మూడో సారి కూడా అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతుంటే.ఈసారి ఎలాగైనా కే‌సి‌ఆర్ ను గద్దె దించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పట్టుదలగా ఉన్నాయి.

దాంతో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనేది విశ్లేషకులు సైతం అంచనా వేయాలేని పరిస్థితి.కాగా తాజా పరిణామాలు చూస్తుంటే బి‌ఆర్‌ఎస్ కు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గట్టి పోటీ ఇచ్చేలాగే కనిపిస్తున్నాయి.

గతంతో పోల్చితే ఈ రెండు పార్టీలు ఊహించని స్థాయిలో పుంజుకున్నాయి.జి‌హెచ్‌ఎం‌సి ఎలక్షన్స్, దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికలతో బీజేపీ అనూహ్యంగా రేస్ బలం పెంచుకుంది.

Telugu Brs, Cm Kcr, Congress, Karnataka, Telangana, Ts-Politics

ఇక కర్నాటక ఎన్నికల( Karnataka Elections ) తరువాత కాంగ్రెస్ కూడా రేస్ లోకి వచ్చింది.దీంతో బి‌ఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టడం అంతతేలికైన విషయం కాదు.ఈ నేపథ్యంలో విజయం కోసం కే‌సి‌ఆర్ ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు ? ప్రత్యర్థులకు ఎలా చెక్ పెట్టబోతున్నారు ? అనే ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి.కాగా ఈ సారి ఎన్నికలకు ఎలాంటి వ్యూహరచన లేకుండా వెళ్లాలని కే‌సి‌ఆర్ ప్లాన్ చేస్తున్నాడట.

గత తొమ్మిదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ది అలాగే అమలౌతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చూపిస్తూ.వాటి ద్వారానే ప్రజల్లోకి వెళ్లాలనే ఆలోచనతో కే‌సి‌ఆర్ ఉన్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అంటే ఈసారి ఎలక్షన్స్ కు ఎలాంటి మేనిఫెస్టో గాని హామీలు గాని కే‌సి‌ఆర్ ప్రకటించకపోవచ్చని టాక్./br>

Telugu Brs, Cm Kcr, Congress, Karnataka, Telangana, Ts-Politics

ఇదే గనుక నిజం అయితే కే‌సి‌ఆర్( CM kcr ) సాహసం చేస్తున్నారనే చెప్పవచ్చు.ఒకవైపు ఓటర్లను ఆకర్శించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటిగా మేనిఫెస్టోలను సిద్దం చేసుకునే పనిలో ఉంటే బి‌ఆర్‌ఎస్ మాత్రం ఎలాంటి మేనిఫెస్టో లేకుండా సంచలనం సృష్టించాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఎలాంటి మేనిఫెస్టో మరియు హామీలు లేకుండా బి‌ఆర్‌ఎస్ ను తెలంగాణ ప్రజలు నమ్మే అవకాశం ఉందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి.

మరి సి‌ఎం కే‌సి‌ఆర్ ఎప్పుడు ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో అంచనా వేయడం కష్టమే కాబట్టి.మేనిఫెస్టో లేకుండా ఎన్నికలకు వెళ్ళిన ఆశ్చర్యం లేదనేది కొందరి మాట.మరి ఈ సంచలన ప్లాన్ ఒకవేళ నిజం అయితే బి‌ఆర్‌ఎస్ కు ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube