టాలీవుడ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్( Sai dharam tej )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్ మేనల్లుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నాడు.
ఇది ఇలా ఉంటే ఇటీవలే విరూపాక్ష సినిమా</em( Virupaksha Movie )తో ప్రేక్షకులను పలకరించిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం బ్రో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు.సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా నటించిన విషయం తెలిసిందే.
ఇందులో సాయి ధరంతేజ్ సరసనా కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది.దీంతో సాయి ధరమ్ తేజ్ ప్రమోషన్స్ పనిలో పడ్డాడు.ఈ క్రమంలోనే ఒక ప్రముఖ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ ఇంటర్వ్యూలో తాను ఆరు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నట్లు వెల్లడించాడు.కాగా గతంలో సాయి ధరమ్ బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే.
ఆ ప్రమాదంతో కొన్నాళ్ళు పాటు సినిమాలకు దూరంగా ఉన్న తేజ్ ఇటీవల విరూపాక్షతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది.
మూడు నెలల గ్యాప్ లో బ్రో మూవీ( Bro movie )ని కూడా తీసుకురావడంతో అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.అయితే ఈ సినిమా తరువాత ఆరు నెలలు పాటు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు వెల్లడించి అందర్నీ షాక్ కి గురి చేశాడు.

సాయి ధరమ్ తేజ్ ఆ బైక్ యాక్సిడెంట్ నుంచి ఇంకా రికవరీ అవ్వలేదట.దానిని నుంచి కోలుకోవడానికి కొంత సమయం తీసుకోవాలని అనుకుంటున్నాడట.అలాగే ప్లేట్స్ తొలిగించడానికి ఒక చిన్న సర్జరీ కూడా ఉన్నట్లు వెల్లడించాడు.కాబట్టి ఒక ఆరు నెలలు పాటు గ్యాప్ తీసుకోని కంప్లీట్ రెస్ట్ లో ఉండి పూర్తిగా కోలుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే ప్రెజెంట్ ఎటువంటి సినిమా కథలు కూడా వినలేదని, అయితే ఈ మధ్యలో తన ఫ్రెండ్స్ తో కలిసి చేసిన ఒక షార్ట్ ఫిలింని మాత్రం ఇండిపెండెన్స్ రోజు రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించాడు సాయి ధరమ్ తేజ్.సాయి ధరంతేజ్ కి మరొకసారి సర్జరీ అని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.







