ఆటో డ్రైవర్లకు కేసీఆర్ కొత్త హామీ..!

తెలంగాణ ప్రజల హక్కుల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పై తీవ్రంగా విమర్శలు చేశారు.

 Kcr's New Guarantee For Auto Drivers..!-TeluguStop.com

ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారన్న కేసీఆర్ ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ ఆకలి చావులేనని మండిపడ్డారు.ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెడతారని ప్రశ్నించారు.

ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ కాదా అని నిలదీశారు.తెలంగాణ ఇవ్వకుండా బీఆర్ఎస్ ను చీల్చే కుట్రలు చేశారని ఆరోపించారు.

అయితే ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణను తిరిగి సాధించుకున్నామని తెలిపారు.ఈ క్రమంలోనే మళ్లీ అధికారంలోకి వస్తే రూ.2 వేలు పెన్షన్ ను రూ.5 వేలకు పెంచుతామని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్లకు కొత్త హామీ ప్రకటించారు సీఎం కేసీఆర్.ప్యాసింజర్ ఆటోలకు ఫిట్ నెస్, పర్మిట్ ఫీజులు రద్దు చేస్తామని తెలిపారు.24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube