ప్రస్తుతం దేశంలో ఏం జరుగుతోంది మోడీ సారధ్యంలోని బీజేపీకి రెండు సార్లు కేంద్రంలో అధికారం ఇస్తే ఈ దేశాన్ని అభివృద్ధి చేయాల్సింది.పోయి డాలర్ తో రూపాయి విలువ ₹ 83 రూపాయలకు పడగొట్టారు.
మన విశ్వ గురువు.నిత్యావసర వస్తువులు మొదలు కొని పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు బతుకు భారమైంది పెరిగిన నిరుద్యోగ సమస్యలకు ఏలాంటి పరిష్కారం చూపలేదు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న మోడీ బీజేపీ ఇపుడు దాదాపు 2 కోట్ల ఉద్యోగాలను ఊడగొట్టింది జిఎస్టీ, నోట్ల రద్దుతో సుమారు 5 లక్షల చిన్న పరిశ్రమలు మూతబడ్డాయి లాభాల్లో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బి ఎస్ ఎన్ ఎల్, ఎల్ ఐ సి, రైల్వే, ఎయిర్ లైన్స్ లను అగ్గువకు తమ అనుకూల కోర్పొరేట్స్ కు అప్పజెప్పింది.
దీనికి తోడు దేశాన్ని ఐక్యతగా ఉంచాల్సిన దేశ పాలకులు కుల ,మత ప్రాంత,భాష విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలను విడతీయాలని చూస్తున్నారు.అన్ని రంగాల్లో విఫలమైన బీజేపీ ఏ ఒక్క మతానికి, కులానికి, వర్గానికి అనుకూలంగా లేదు.
దళితులు, మైనార్టీలపై దాడులు మహిళలపై అత్యాచారాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి.దేశ సంపదకు మూల కారణమైన వ్యవసాయ రంగానికి చేయూత లేదు కదా పండించిన ధాన్యాన్ని కొనే సోయిలేక ఈ రంగాన్ని మరింత అధోగతి పాలు చేయడానికి రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తెచ్చి 750 మంది రైతులను పొట్టన బెట్టుకున్నారు రైతన్నల ఆందోళనలతో వెనక్కి తగ్గి రైతులకు క్షమాపణలు చెప్పి చెంపలేసుకొని పార్లమెంట్ లో బిల్లును రద్దు చేసుకున్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 8 ఏళ్లలో ప్రజలకు మేలు చేసే ఒక్క సంక్షేమ పథకం లేదు .మోడీ ప్రభుత్వం ఒక కోటి లక్షల అప్పును చేసింది ఈ అప్పును ఏ రంగాల్లో పెట్టుబడులు గా పెట్టారు ప్రజలకు ఏమైనా ప్రయోజనం కలిగిందా అంటే జవాబు శూన్యం? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి గత పాలకులు 68 ఏళ్లలో 50 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే 56 ఇంచుల విశ్వగురువు కోటి లక్షల కోట్ల రూపాయల అప్పును చేసింది .ఈ డబ్బంతా బడా పారిశ్రామిక వేత్తల జేబుల్లోకి వెళ్లిందనేది ఏ మాత్రం సందేహం లేదు కార్పొరేట్ లకు కొమ్ముకాచే మోడీ ప్రభుత్వం ఆదానీ ,అంబానీ లు ప్రపంచ కుభేరులను చేసి ప్రజలకు చిప్ప చేతికి ఇచ్చింది దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల అప్పులను ఎ న్ పిఏల పేరుతో రద్దు చేసింది.దేశంలో ఉన్న 75 కోట్ల బీసీ లకు 30 కోట్ల దళితులకు 25 కోట్ల దళితులకు వ్యతిరేకంగా ఉంది.
ఇంకా బీజేపీ మళ్ళీ అధికారం లోకి వస్తే ఈ దేశం ఆదిమ యుగంలోకి పోయి శ్రీలంకలో గొట్టబయ ప్రభుత్వం పై తిరుగుబాటు చేసినట్లు అరాచకం వచ్చి మన దేశంలో సివిల్ వార్ తప్పక వచ్చి తీరుతుంది.
భారత రాజ్యాంగం ప్రకారం మన దేశంలో ఫెడరలిజం అనేది యూనియన్ ప్రభుత్వం,దేశంలో ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది.
భారత రాజ్యాంగం భారత ప్రభుత్వ నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది పార్ట్ 11 వ భాగం భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం శాసనసభ నిర్వాహక మరియు కార్యనిర్వాహక అధికారాలను పంపిణీని నిర్దేశిస్తుంది .స్టేట్స్ ఆఫ్ భారత దేశం శాసనసభ అధికారాలు యూనియన్ జాబితా మరియు ఉమ్మడి జాబితా క్రింద వర్గీకరించబడినవి.కేంద్ర ప్రభుత్వానికి ప్రధానం చేయబడిన అధికారాలు మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వబడిన అధికారాలు ఈ ఫెడలరిజం సమ రూపంగా ఉంటుంది.దీనిలో రాజ్యాంగ యూనిట్లు అధికారాలు కేంద్రానికి రాష్ట్రాలకు ఒకే విధంగా ఉంటాయి.

ఇప్పటికే ఒక రాష్ట్ర సీఎం గా ఉండి తమ సంక్షేమ పథకాలతో దేశ ప్రజల అభిమానాన్ని పొందిన మొండి ఘటం కేసీఆర్ భారత జాతీయ రాజకీయాల్లో అడుగు పెడితే తమ పని అయిపోతుందని బేంబేలెత్తు తున్న బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణా నుండి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాకుండా పెద్ద ఎత్తున భారీ కుట్ర రాజకీయాలకు తెరలేపింది.ఇన్నాళ్లు ఈ డి , ఐటి, సిబిఐ ల పేరుతొ పరోక్షంగా, ప్రత్యక్షంగా బెదిరించిన కూడా కేసీఆర్ లెక్క చేస్తా లేనందున 15నెలల కాలానికి మునుగోడు లో బలవంతపు ఉప ఎన్నిక తెచ్చి ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్ల ఆఫర్ చేశారు.ఈ కుట్రలో బీజేపీ అగ్ర నాయకత్వంలో నే జరుగుతుందని ఢిల్లీ బ్రోకర్ రామచంద్ర భారతి మాట్లాడిన ఆడియో,వీడియో టేపుల్లో స్పష్టమవుతుంది.ప్రభుత్వాన్ని పాడగొట్టి కెసిఆర్ అడ్డు తొలగించు కోవాలని తద్వారా దక్షిణాధిలో బిజెపి బలం పెంచుకోవాలి దక్షిణాది వ్యతిరేక బిజెపి కుట్ర పన్నింది ఈ కుట్రను ఆత్మ గౌరవం ఉన్న తెలంగాణా బిడ్డలైన ఎమ్మెల్యే లు వాళ్ళు పన్నిన పద్మ వ్యూహం నుండి బయటపడి బీజేపీ కుట్ర ను బయట పెట్టారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణా ను గుజరాతి గులాం ల పాలు కాకుండా కాపాడిన ఎమ్మెల్యే లకు తెలంగాణా సమాజం రుణపడి ఉంది బిజెపి అధికారం లోకి వచ్చిన 8ఏళ్లలో ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టింది తమకు ఎమ్మెల్యే ల మెజారిటీ లేకున్నా కొని,పార్టీలను చీల్చి,బెదిరించి, ప్రజా తీర్పు కు వ్యతిరేకంగా తమ ప్రభుత్వాలను రాజ్యాంగ విరుద్ధంగా, అనైతికంగా ఏర్పాటు చేసుకోవడం ఎంత వరకు సమంజసం ఎవరైనా అధికారం లోకి రావాలని కోరుకుంటే ప్రజా క్షేత్రం లో కి వెళ్లి తమ అజెండా చెప్పి ప్రజలకు తాము ఏమి చేస్తామో చెప్పి వారి ఆమోదం తో అధికారం లోకి రావాలి.కానీ ఇలా చేయడం భారత దేశ ప్రజాస్వామ్యనికి తీరని మచ్చ బిజెపి ఇంతకు ముందు పెట్టుబడుల ఉప సంహారణ శాఖ ను ఏర్పాటు చేసుకున్నట్లు ఇప్పుడు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా నేత్రుత్వం లో పార్టీలను చీల్చి ఎమ్మెల్యే లను కొనే శాఖ ను ఏర్పాటు చేసుకోంది.

దేశానికి ఇపుడు ఎటువంటి పాలన రావాలి ఎలాంటి రాజకీయాలు ఉండాలి విభిన్న, మతాలు, కులాలు, సంస్కృతులు, భాషలు, యాస లు, వేషధారణ, ఆహారపు అలవాట్లు కలభారత దేశానికి విద్వేష, విధ్వంసకర రాజకీయాలు అవసరం లేదని అవి పనికి రావని భారత దేశ చరిత్ర చెబుతుంది .140 కోట్ల ప్రజల మనసులను దోచుకొనే నాయకుడు కావాలి.కాశ్మీర్ నుండి కన్యకుమారి వరకు గల భౌగోళిక, రాజకీయ, సామాజిక సమస్యలపై స్పష్టమైన అవగాహనతో పాటు పరిష్కారం చేయగల సత్తా, శక్తి, సామర్థ్యం, దూరదృష్టి గల నేత ఇప్పటి భారత దేశానికి అత్యంత అవసరం ఉంది.ఇప్పుడు సిద్ధాంతాల రాద్దాం తాలకన్న మనిషి అభివృద్ధి కేంద్రంగా జరిగే సంక్షేమ పథకాలు అమలు జరగాలిఫేక్ గుజరాత్ మోడల్ లా కాకుండా దేశానికి రైతు బంధు, రైతు భీమా, కాళేశ్వరం లాంటి అతి భారీ ప్రాజెక్టు ని నిర్మించి వ్యసాయ, సాగునీటి రంగంలో, సంక్షేమ పథకాలలో రోల్ మాడల్ గా నిలిచిన “కేసిఆర్ తెలంగాణ రోల్ మోడల్” దేశంలోని ప్రజల సమస్యలకు పరిష్కారం చూపగలదని కేసిఆర్ తెలంగాణలో నిరూపించారు.
దేశాన్ని అభవృద్ధి బాటలో నడిపించుటకు సమృద్దిగా వనరులు ఉన్నాయని దాన్ని వాడుకొని సోయి లేదని కేంద్రం పై విమర్శల జడివాన కురిపించారు అయిన దున్నపోతు మీద వానపడ్డట్లే వారి వ్యవహారం ఉంది.కేసీఆర్ దేశాభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గం కూడా చెప్పారు.
దేశంలో ప్రతి ఏటా 1 లక్ష 45 వేల టి ఎం సి ల నిలువ గల వర్షపు నీరు వస్తుందని దాన్ని సరిగ్గా వినియోగం లోకి తెస్తే 70 వేల టి ఎం సి ల నీటిని ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకొని దేశాన్ని సస్యశ్యామలం చేయొచ్చని అలాగే దేశంలో ఇపుడు ఉత్పత్తి అవుతున్న 4 లక్షల మేఘా వాట్ల విద్యుత్తులో రైతులకు ఉచితంగా ఇస్తే ఒక లక్ష 45 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు పారిశ్రామిక వేత్తలకు లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తున్న ప్రభుత్వం రైతులకు చేస్తే ఈ జిడిపి మరింత పెరుగుతుందని అన్నారు .ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు భీమా సాగునీటి ప్రాజెక్టులు, హైదరాబాద్ ఐ టి అభివృద్ధి కేసీఆర్ గారిని దేశ రాజకీయ చిత్ర పటం లో బలమైన నాయకునిగా నిలబెట్టింది.దేశానికి ఇపుడు ఎటువంటి పాలన రావాలి ఎలాంటి రాజకీయాలు ఉండాలి విభిన్న, మతాలు, కులాలు, సంస్కృతులు, భాషలు, యాసలు, వేషధారణ, ఆహార పు అలవాట్లు గల భారత దేశానికి విద్వేష, విధ్వంసకర రాజకీయాలు అవసరం లేదని అవి పనికి రావని భారత దేశ చరిత్ర చెబుతుంది .