కొద్ది రోజుల కిందట బీఆర్ఎస్ ( BRS party )అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు.అయితే ఈ జాబితాలో చాలామంది కీలక నాయకులకే చోటు డొక్కలేదు.
కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తప్పించారు.దీంతో తీవ్ర అసంతృప్తికి గురై పార్టీ మారేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇదే వరుసలో వేములవాడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్( Channamaneni Ramesh ) కూడా ఉన్నారు. తనకు టికెట్ కేటాయించకపోవడం పై ఆయన తీవ్ర అసంతృప్తికి గురై పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చారు.
ఈ మేరకు ముఖ్య అనుచరులతో ఆయన సమావేశాలు నిర్వహించారు.వేములవాడ అసెంబ్లీ టికెట్ చెన్నమనేని రమేష్ కు కాదని , చల్మెడ విద్యాసంస్థల అధినేత చల్మెడ లక్ష్మీనరసింహరావుకు కెసిఆర్ ప్రకటించారు.
ఈయన కేటీఆర్( KTR ) కు అత్యంత సన్నిహితుడు కావడంతో , ఈ సీటును దక్కించుకున్నారనే ప్రచారం జరిగింది .

రమేష్ మద్దతుదారులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు.ఈ వ్యవహారం పై చెన్నమనేని రమేష్( Channamaneni Ramesh ) కూడా సోషల్ మీడియాలో స్పందించారు .ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేతలు రంగంలోకి రమేష్ ను బుజ్జగించే ప్రయత్నం చేశారు.అనుహంగా కెసిఆర్ రమేష్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఆయన అసంతృప్తిని పోగొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ సలహాదారుగా రమేష్ ను నియమించారు. వ్యవసాయ శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ చెన్నమనేని రమేష్ బాబును ఈ పదవిలో నియమిస్తూ కేసిఆర్ ( CM kcr )నిర్ణయం తీసుకున్నట్లు సీఎంఓ ప్రకటన విడుదల చేసింది. క్యాబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో ఆయన ఐదేళ్లపాటు కొనసాగనున్నారు.
చాలా కాలం నుంచి చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం పై కోర్టులో కేసు నడుస్తోంది.

రమేష్ కు జర్మనీ పౌరసత్వం తో పాటు, భారత పౌరసత్వం కూడా ఉండటంపై కాంగ్రెస్ కు చెందిన ఓ నేత కోర్టులో పిటిషన్ వేశారు.దీనిపై ఇంకా విచారణ జరుగుతూనే ఉండగా.ఈ వ్యవహారాన్ని అడ్డంకిగా చూపిస్తూ కేసీఆర్ రమేష్ కు టికెట్ ను నిరాకరించారు.
అయితే ఈ నియోజకవర్గంలో ఆయనకు మంచి పలుకుబడి ఉండడం, పార్టీ మారే ఆలోచనతో ఉండడం తో రమేష్ ను బుజ్జగించేందుకు ప్రభుత్వ సలహాదారు పదవిని కేసీఆర్ ఇచ్చి సంతృప్తి పరిచారు.