బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి పయనం అయ్యారు.ఇవాళ హస్తినలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు.
ఇందులో భాగంగా మధ్యాహ్నం 12.30 గంటలకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో కేసీఆర్ పూజలు నిర్వహించనున్నారు.మధ్యాహ్నం 1.05 గంటలకు ఆఫీస్ ను ప్రారంభించనున్నారు.అనంతరం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం అవుతారు.







