కేసీఆర్ ప్రత్యర్థులపై విసిరే పంచులు యమ నవ్విస్తాయి.ఎంత పెద్ద ప్రత్యర్థి అయినా సరే తన కామెడీ డైలాగులతో వారిపై వేసే సెటైర్లు అసలు ఆయన ప్రత్యర్థేనా అనే అనుమానాలు కలిగిస్తాయి.
ఇప్పటికే ఎంతో మందిపై ఇలాంటి వ్యాఖ్యలే చేసిన వారిని తాను ఎన్నడూ ప్రత్యర్థులుగా భావించట్లేదనే భావనను ప్రజలకు కలిగిస్తారు కేసీఆర్.తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచే ఈ పంథాను అనుసరిస్తున్నారు కేసీఆర్.
ఇప్పటికీ దీన్నే ఫాలో అవుతుంటారు.
కొన్ని సార్లు సమావేశాల్లో మాట్లాడేటప్పుడు ప్రత్యర్థుల పేర్లు చెప్పకుండా కామెడీ పీస్‌లుగా మార్చేస్తుంటారు.
సపోజ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయాలనుకున్నప్పుడు నేరుగా ఆయన పేరును ప్రస్తావించకుండా ఆ యాక్టర్ పేరేంది అంటూ పక్కనున్న వారిని అడుగుతుంటారు.అంటే పవన్ కల్యాణ్ కూడా కేసీఆర్‌కు తెలీదా అని ప్రజలు అనుకోవాలన్నమాట.
అంటే వారిని కనీసం తాను సీరియస్‌గా కూడా తీసుకోవట్లేదనే విషయాన్ని ఇన్ డైరెక్టుగా చెబుతుంటారు.

ఇక రేవంత్ విషయానికి వస్తే కనీసం ఆయన పేరు పలకడానికి కూడా కేసీఆర్‌కు ఇష్టం ఉండదు.ఎప్పుడు మాట్లాడినా ముఖం చాటేస్తుంటారు.మరి ఇప్పుడు ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ కావడంతో ఖచ్చితంగా ఆయన గురించి విమర్శలు చేయాల్సిందే.
ఇక రేవంత్ అయితే రెండు రోజులుగా సీఎం కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు.అలాంటప్పుడు కేసీఆర్ రేవంత్ గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం ఆయనపై ఉన్న ఓటుకు నోటు కేసును బూచిగా చూపిస్తూ మాట్లాడే అవకాశం ఉంది.
అంటే ఆ ఓటుకు నోటు కేసులో దొరికిన ఆయన ఎవరు అని చమత్కారం చేసే ఛాన్స్ ఉందన్న మాట.రేవంత్ ను తీసిపారేసేలా మాట్లాడటమే కాకుండా ఆయన్ను ఓ కామెడీ పీస్ గా మార్చేయాలని కేసీఆర్ చూస్తున్నట్టు తెలుస్తోంది.
మంత్రులతో కూడా ఇలాగే మాట్లాడించాలని కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారు.