రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై మౌనంగా కేసీఆర్... అసలు వ్యూహం ఇదేనా?

తెలంగాణ రాజకీయాలన్నీ కేసీఆర్ చుట్టూనే తిరుగుతున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే చాలా వరకు చిన్న చిన్న పార్టీలు సైతం పాదయాత్రల పేరుతో కేసీఆర్ టార్గెట్ గా విరుచుకపడుతున్న పరిస్థితిల్లో కేసీఆర్ మాత్రం మౌనంగా ఉండటం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది.

 Kcr Silence On Telangana Politics,telangana Politics,telangana, Cm Kcr, Trs,bjp,-TeluguStop.com

అయితే ఎంతగా వ్యతిరేకత పెరిగితే అది అంతలా కేసీఆర్ కు అనుకూలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే అలా అనుకూలంగా ఎలా మార్చుకుంటారన్నది ఇప్పుడు సర్వత్రా కొనసాగుతున్న చర్చ.

అయితే ఉద్యోగాల భర్తీని సైతం వేగవంతం చేస్తున్న పరిస్థితులలో ఇక రానున్న రోజుల్లో మరిన్ని ప్రజాకర్షక పధకాలను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.

దీంతో టీఆర్ఎస్ అనుకూల వాతావరణాన్ని పెంపొందించుకోవాలనే వ్యూహాన్ని కెసీఆర్ ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ఎంత మేరకు ఈ వ్యూహం సత్ఫలితాలనిస్తుందనే విషయాన్ని ప్రక్కన పెడితే ఎలా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ విమర్శల దాడులను కెసీఆర్ ఎదుర్కొంటారనేది  ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.అయితే సరికొత్త ప్రజాకర్షక పధకాలు అంతేకాక అందరూ కలిసి టీఆర్ఎస్ ను అడ్డుకుంటున్నారనే ఒక బలమైన ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే అవకాశం కనిపిస్తోంది.

Telugu Bandi Sanjay, Bjp Trs, Cm Kcr, Kcr Telangana, Telangana-Political

అయితే ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తమ బలాన్ని పెంచుకోవడానికి సిద్దమైన తరుణంలో ఇక బీజేపీ గాలి వీస్తుందనే ఒక బలమైన ప్రచారాన్ని చేసి తద్వారా కొత్త అభ్యర్థులను సైతం సునాయాసంగా గెలిపించుకోవాలనే ఒక వ్యూహతో బీజేపీ ముందుకెళ్తున్నా కెసీఆర్ కూడా తనకున్న వ్యతిరేకతను అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది.మరి కెసీఆర్ ఎలా ఈ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటారు, మరల ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వచ్చేలా ఎలా పావులు కదుపుతారనేది ఇప్పుడు రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి నేడు నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube