ఎవ్వడయ్యా నీకు ఆ విషయం చెప్పిందన్న కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల ఫలితాలపై స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చాడు.ఈ సందర్బంగా కేసీఆర్‌ మాట్లాడుతూ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు.

 Kcr Seriouswarning Give The Media About Vro Issue-TeluguStop.com

ఆర్టీసీ సమ్మెపై తీవ్ర స్థాయిలో మండి పడ్డ కేసీఆర్‌ ఇక ఆర్టీసీ మనుగడ అసాధ్యం.ప్రైవేట్‌ పరం చేయాల్సిందే అంటూ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు.

ఇదే సమయంలో కొందరు వీఆర్‌ఓలను తొలగిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.మేము తీసుకు వచ్చిన కొత్త చట్టంతో వీఆర్‌ఓలకు పని ఉండదని వారందరిని కూడా తొలించబోతున్నట్లుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు.

దీనిపై కేసీఆర్‌ సీరియస్‌ అయ్యాడు.అసలు మీకు వీఆర్‌ఓలను తొలగిస్తున్నట్లుగా ఎవరు చెప్పారయ్యా.సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా పనులు చేసుకునేలా వ్యవస్థను తీసుకు రావాలనుకుంటున్నాం.కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అంతా పాటించాల్సిందే.

వీఆర్‌ఓ వ్యవస్థ తొలగిస్తే అప్పుడు వారిని మరో చోటుకు తరలించే అవకాశం ఉంటుంది.అంతే తప్ప వారికి పూర్తిగా అన్యాయం ఎలా చేస్తామంటూ కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశాడు.

రైతులు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా భూమికి సంబంధించిన రికార్డుల సవరణ ఇంకా పూర్తి పనులు చేసుకునేలా మేము చర్యలు తీసుకుంటున్నట్లుగా కేసీఆర్‌ ప్రకటించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube