వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు పై చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు బీఆర్ఎస్( BRS ) అధినేత సీఎం కేసీఆర్.( CM KCR ) మూడోసారి తెలంగాణలో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు.
కాంగ్రెస్ బిజెపి ల నుంచి ఎంత గట్టిగా పోటీ ఎదురైనా, ఎదుర్కొని తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.అందుకే టిక్కెట్ల కేటాయింపు విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు.
గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వేలు నిర్వహిస్తున్నారు .కాంగ్రెస్, బిజెపిల బలం ఎంత ? బీఆర్ఎస్ కు పట్టున్న నియోజకవర్గలు ఏమిటి ? అక్కడ ఎవరిని అభ్యర్థిగా రంగంలోకి దింపితే విజయం దక్కుతుంది అనే అనేక అంశాలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే… బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అప్పుడే వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో కెసిఆర్ పై ఒత్తిళ్లు చేస్తున్నారట .వచ్చే ఎన్నికల్లో తాము పోటీకి దూరంగా ఉంటామని, బదులుగా తమ వారసులు, బంధువులకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారట.ఇలా ఒత్తిడి చేస్తున్న వారిలో పార్టీ సీనియర్ నేతలే ఎక్కువగా ఉన్నా, మొహమాటాలను అన్నిటిని పక్కన పెట్టి వారి ప్రతిపాదనకు నో చెప్పేస్తున్నారట.
బాన్సువాడ ఎమ్మెల్యే , స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి , మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు వచ్చే ఎన్నికల్లో తమ బంధువులు, వారసులకు టికెట్లు ఇవ్వాలని అధినేత కేసీఆర్ ను కోరారట.
అయితే వారి అభ్యర్థన ఆధారంగా వారి స్థానంలో లేదా ఇతర నియోజకవర్గాల్లో వారసులు, బంధువులకు టికెట్లు ఇచ్చేందుకు కెసిఆర్ ఇష్టపడడం లేదట.పోచారం శ్రీనివాస్ రెడ్డి( Pocharam Srinivas Reddy ) తన స్థానంలో బాన్సువాడ నుంచి తన ఇద్దరు కుమారుల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలని కెసిఆర్ కోరుతున్నా, ఆయన నిరాకరించారట.అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్( Talasani Srinivas Yadav ) సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఒక నియోజకవర్గంలో నుంచి తన కుమారుడు సాయికిరణ్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలని కోరగా, సర్వే రిపోర్ట్ లు ఆధారంగానే టికెట్లు ఇస్తామని, సిఫార్సులు, ఒత్తిళ్లు పట్టించుకోమని కేసీఆర్ స్పష్టం చేశారట.
ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడు అమిత్ రెడ్డికి నల్గొండ లేదా మునుగోడు అసెంబ్లీ నుంచి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారట.అలాగే ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తన కుమారుడు జోగు ప్రేమేందర్ కు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తన తనయుడు ప్రశాంత్ రెడ్డికి, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే కుమారుడు హరీష్ షిండే కు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ పై ఒత్తిడి చేస్తున్నారట.అయినా కేసీఆర్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా సర్వే నివేదికల ఆధారంగానే గెలుపు గుర్రాలకి టిక్కెట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారట.