ఇంట నిలిచి... రచ్చ గెలిచి.. కేసీఆర్ ది పెద్ద ప్లానే..!

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఖమ్మంలో భారీ సభ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే.తాను జాతీయ పార్టీ స్థాపించిన తర్వాత ఇదే మొట్టమొదటి బహిరంగ సభ.

 Staying At Home Winning The Ruckus Kcr Is The Big Plan , Kcr , Brs Party,prime-TeluguStop.com

ఈ సభకు దాదాపు 5 లక్షల మంది ప్రజలు వస్తారని అందరూ అంచనా వేస్తున్నారు.పైగా ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రానికి రానున్న ఒక రోజు ముందే ఈ సభను నిర్వహించడం గమనార్హం.

ఈ విషయం పక్కన పెడితే… గులాబీ బాస్ ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్లో కూడా తన పార్టీని నెలకొల్పి అక్కడ అధ్యక్షుడినీ ప్రకటించేసాడు.అది జరిగిన ఒక రెండు రోజులు హడావుడి మాములుగా లేదు.

ఈ బజ్ అంతా కేసీఆర్ కు నచ్చినట్టుంది.ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఈ భారీ బహిరంగ సభ జరుగుతున్న చోటు గురించి.

ప్రత్యేకంగా కేసీఆర్ ఖమ్మం జిల్లా ఎంచుకోవడానికి ఒక మంచి కారణమే ఉంది.

ఖమ్మం జిల్లా సరిగ్గా మూడు రాష్ట్రాలకు సరిహద్దు జిల్లాగా ఉంది.

పార్టీ పెట్టిన తర్వాత మంచి ఊపు సంపాదించుకున్న కేసీఆర్ నేరుగా ఏపీలో అడుగుపెట్టడం కంటే పక్కనే ఉన్న జిల్లాలో నిలిచి ఆ రాష్ట్రపు సమస్యలపై మాట్లాడి పాజిటివ్ టాక్ తెచ్చుకునే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ఖమ్మంలో వామపక్షాలకు బాగా బలం ఉంది.

కాబట్టి తను ఎలాంటి విషయానికి తలొగ్గే ఆషామాషీ లీడర్ ను కాను అని తెలిసేలాగా కూడా ఇదే స్పాట్ ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు.ఇటీవల మునుగోడులో ఎన్నికలకు కమ్యూనిస్టులు ఒప్పించి వారితో పాటు కలిసి పోటీకి వెళ్లారు.పైగా పార్టీలో అంతర్గత విభేదాలు కూడా ఎన్నో ఉన్నాయి.

వీటన్నిటికి ఒకటే సమాధానం చెప్పేందుకు ప్లస్ పక్క రాష్ట్రాల వారికి రీ సౌండ్ వినిపించేలాగా తెలియజేసేందుకు కెసిఆర్ గట్టి ప్లాన్ వేశాడని తెలుస్తోంది.మరి కెసిఆర్ తన కల సాధించేందుకు ప్లానింగ్ పర్ఫెక్ట్ గానే ఉంది కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్న విషయం మాత్రం వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube