ప్రతిపక్షాలను వ్యూహాత్మకంగా దెబ్బకొడుతున్న కెసీఆర్.. అసలు వ్యూహం ఇదేనా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మాటల తూటాలతో హాట్ హాట్ గా మారిన పరిస్థితి ఉంది.

అయితే తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేదన్నది సుస్పష్టం.

అయితే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు అధికారం చేపట్టిన పరిస్థితుల్లో ఇక మూడో సారి అధికారం చేపడితే ఇక ప్రతిపక్ష పార్టీలు ఇక బాలపడటం చాలా కష్టతరమైన విషయం.దానికి చాలా కారణాలు ఉన్నాయి.

ముఖ్యంగా ప్రధాన కారణమేమిటనే విషయాన్ని పరిశీలిస్తే ఇప్పటికే పది సంవత్సరాలకు పైగా చాలా వ్యయ ప్రయాసలకోర్చి రాజకీయం చేసిన ప్రతిపక్షాలు ప్రజలు తమ వెంట లేరని తెలిసి పోరాడటంలో కొంత వెనుకబడే అవకాశం ఉంది.ఇదే అదునుగా ప్రతిపక్షాలను నీరుగార్చే ప్రయత్నం చేసే అవకాశం ఉంది.

తద్వారా ప్రతిపక్షాలు బలహీన పడటమే కాకుండా ప్రజల్లో ఆదరణ కోల్పోయే అవకాశం ఉంది.ప్రస్తుతం కెసీఆర్ చాలా వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలను దెబ్బ కొడుతున్న పరిస్థితి ఉంది.

Advertisement

అందుకు ముఖ్య ఉదాహరణ బీజేపీ.మొన్నటి వరకు చాలా దూకుడుగా ఉన్న బీజేపీ గత పది రోజుల నుండి చాలా జాగ్రత్తగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ పర్యటనలో బీజేపీ పార్టీ కి ఎదురైన నిరసన సెగతో బీజేపీ కొంత వెనక్కి తగ్గాలని నిర్ణయించుకునట్లు సమాచారం.

అయితే బండి సంజయ్ యాసంగీ వరి వేయాలని చేసిన వ్యాఖ్యల ఫలితంగా రానున్న రోజుల్లో కెసీఆర్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తరువాత రైతులకు ఏ పంటలు వేసుకోవాలని వివరించే విలేఖరుల సమావేశంలో బీజేపీని మరింత ఇరుకున పెట్టే విధంగా విమర్శలు చేసే అవకాశం ఉంది.దీంతో బీజేపీని రైతులు శాశ్వతంగా వ్యతిరేకించాలన్నది కెసీఆర్ వ్యూహంగా అనిపిస్తోంది.

మరి రానున్న రోజుల్లో ఏమి జరుగుతుందనేది చూడాల్సి ఉంది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు