తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ప్రతిపక్ష, అధికార పక్ష పార్టీల మధ్య మాటల తూటాలతో పెద్ద ఎత్తున హాట్ హాట్ గా మారడమే కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ టీఆర్ఎస్ పార్టీ పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంచడమే కాకుండా క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ క్యాడర్ చేస్తున్న పనులను కూడా నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ క్యాడర్ ను బలహీనపరిచే ప్రయత్నం అనేది కూడా కొనసాగుతున్నదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.ఇప్పటికే చాలా వరకు కెసీఆర్ పై వ్యతిరేకత ప్రారంభమైనదని ఒక ప్రచారం జోరుగా ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసీఆర్ తీసుకునే నిర్ణయాలు ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది.
తాజాగా వీఆర్ఏ లను, ఫీల్డ్ అసిస్టెంట్ లను విధుల్లోకి తీసుకుంటామని కెసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఇక రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కెసీఆర్ తీసుకునేవి సానుకూలంగానే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే ఇక వ్యతిరేకత కొంత పెరుగుతుంది అని తెలిసిన నేపథ్యంలో కొంత ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకుంటేనే ఎంతో కొంత ప్రజల్లోకి బలంగా వెళ్ళడంతో పాటు ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది.లేకపోతే ప్రతిపక్షాలు ఇక ధర్నా చేస్తున్న ప్రతి ఒక్కరి పక్షాన నిలుస్తూ మరింతగా అధికార పక్షాన్ని ఇబ్బందిపెట్టే అవకాశం ఉంటుంది.
ఏది ఏమైనా కెసీఆర్ సానుకూల నిర్ణయాలు ఏ మేరకు టీఆర్ఎస్ పార్టీకి అనుకూల పవనాలు వీయడానికి ఉపయోగపడతాయనేది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేకపోయిన రానున్న రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలను బట్టి కాస్త అవగాహన వచ్చే అవకాశం ఉంది.అయితే ఏది ఏమైనా రానున్న రోజుల్లో కెసీఆర్ ఇంకెలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.







