టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఎవరికీ అంత తేలిగ్గా అర్థం కావు. ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆలోచనలు మొదట్లో ఎవరికీ అర్థం కాకపోయినా, చివరకు వాటి ఫలితాలు మాత్రం టిఆర్ఎస్ కు ఎప్పుడు అనుకూలంగానే ఉంటాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెసేతర కూటమిని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.దీని కోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, అనేక ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను కలుస్తూ బీజేపీకి ఆందోళన కలిగేలా చేస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రాంతీయ పార్టీల కూటమి కీలకంగా మారుతుందనేది కేసీఆర్ అంచనా.ఇక విషయానికి వస్తే నిన్ననే కేసీఆర్ ముంబై కి వెళ్లారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తో భేటీ అయ్యారు.అనేక కీలక అంశాలపై చర్చించారు.
కేసీఆర్ వెంట ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బీబీ పాటిల్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సంతోష్ కుమార్ ఉన్నారు వీరితో పాటు సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది.అసలు కేసీఆర్ పర్యటన లో ప్రకాష్ రాజ్ ఎందుకు ఉన్నారు ? ఆయనకు ఈ బీజేపీ వ్యతిరేక కూటమి కి సంబంధం ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది.ఆయన చాలాకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబడుతూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తున్నారు.కర్ణాటకకు చెందిన ప్రకాష్ రాజ్ గతంలో ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లోనూ మెగా స్టార్ చిరంజీవి అండదండలతో ఎన్నికల్లో పోటీచేసినా, ఓటమి చెందారు.
గతంలో కేసీఆర్ కర్ణాటక వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ ను కలిశారు.ఆ సందర్భంగా ఆయన వెంట ప్రకాష్ రాజ్ సైతం వెళ్లారు.
ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్య మంత్రి ని కలిసేందుకు వెళ్ళిన కేసీఆర్ బృందంలో ప్రకాష్ రాజు ఉండడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
కేవలం బీజేపీకి వ్యతిరేకంగా ప్రకాష్ రాజు పోరాటం చేస్తూ, కేంద్ర బీజేపీ పెద్దలను ఇరుకున పెడుతుండడంతోనే కేసీఆర్ తన టీమ్ లో ప్రకాష్ రాజ్ కు చోటు కల్పించారని , దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల అధి నేతలను కలిసేందుకు వెళ్తున్న సమయంలోనూ ప్రకాష్ రాజ్ ను కేసీఆర్ వెంట తీసుకు వెళ్లి తమ కూటమిలో కీలక వ్యక్తిగా ఆయనకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.