తెలంగాణ సీఎం కేసీఆర్ పరాన్న జీవి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.కేసీఆర్ ఆలోచన సామర్థ్యాన్ని కోల్పోయారన్న రేవంత్ రెడ్డి ఇక ఎప్పటికీ స్వయం ప్రకాశులు కారని చెప్పారు.
ఇతరులపై ఆధారపడి జీవించే వాడు పరాన్నజీవి అన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఆలోచన లేదన్నారు.ప్రజలపై చిత్తశుద్ధి లోపించిందని కేసీఆర్ పై ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ హామీలను కేసీఆర్ కాపీ కొట్టారని విమర్శించారు.కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించేంత వరకు కేసీఆర్ తమ అభ్యర్థులకు బీ -ఫామ్ లు ఇవ్వలేదన్నారు.
బీఆర్ఎస్ నేతలు సొంతంగా ఆలోచించే శక్తిని కోల్పోయారని ఎద్దేవా చేశారు.బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూశాక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రజలకు అర్థం అయిందని తెలిపారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు అవుతాయన్న నమ్మకాన్ని ప్రజలకు కేసీఆరే కల్పించారని వెల్లడించారు.







