కేంద్రం ఇచ్చే నిధుల్నిసద్వినియోగం చేసుకోని కేసీఆర్ సర్కార్..

కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది.అయితే కేంద్రం నేరుగా ఏ పథకాన్ని అమలు చేయలేదు.

 Kcr Govt Not Utilizing Central Funds Kcr Govt , Central Funds, Trs , Bjp, Coro-TeluguStop.com

పథకాలన్నీ రాష్ట్ర్ర ప్రభుత్వాలే అమలు చేస్తాయి.అందుకే కేంద్ర పథకాలను తమ పథకాలుగా రాష్ట్రాలు చెప్పుకుంటున్నాయి.

కరోనా నిధుల్ని తెలంగాణ చాలావరకు ఉపయోగించుకోలేదు.ఎంతో ఒత్తిడి తర్వాతే ఆయుష్మాన్ భారత్ వంటి పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నారు.

కేంద్రం కొన్ని లక్షల కోట్ల నిధులను రాష్ట్రాలకు వివిధ పథకాల కోసం విడుదల చేస్తోంది.కాని కేంద్ర ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో యంత్రాంగం లేదు.అందువల్ల ఏ పథకమైనా రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేయాల్సి ఉంటుంది.దీన్ని ఆసరాగా తీసుకుని అన్ని పథకాలను రాష్ట్రాలు తమ సొంత పథకాలుగా ప్రజల్లో ప్రచారం చేస్తాయి.

ప్రతి పథకం గురించి కేంద్ర ప్రభుత్వం ప్రజల్లోకి వచ్చి చెప్పుకోవడం సాధ్యం కాదు.కొన్ని పథకాలను తెలంగాణ అమలు చేయడంలేదు.

మరికొన్నిటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలేదు.పైగా కొన్ని పథకాల నిధులను ఇతర కార్యక్రమాలకు కూడా మళ్లించుకుంటోంది.

Telugu Central Funds, Corona, Kcr-Political

కరోనా మహమ్మారి విజృంభించినపుడు రోగులకు చికిత్స కోసం కేంద్రం అన్ని రాష్ట్రాలకు భారీ ఎత్తున నిధులు విడుదల చేసింది.అయితే తెలంగాణ మాత్రం వాటిని సద్వినియోగం చేసుకోలేదు.రాష్ట్రంలో కరోనాను అదుపు చేశామని చెప్పుకునేందుకు సరిగా పరీక్షలు నిర్వహించకుండా కేసులు తక్కువ చూపించింది.దీంతో కేంద్ర నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం పెద్దగా రాలేదు.అయితే తెలంగాణ సర్కార్ చెప్పిన లెక్కలకు వాస్తవానికి పొంతన లేదని స్మశాన వాటికలే చెప్పాయి.ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక్క అల్లాడిపోయిన రోగులు వేల సంఖ్యలోనే ఉన్నారు.కాని రాష్ట్రంలో కేసుల సంఖ్య తక్కువని ప్రచారం చేసుకుంది.నిధుల విషయంలో వివక్ష చూపిస్తోందంటూ విమర్శలు మాత్రం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube